Wednesday, November 13

CURRENT AFFAIRS – SEPT 27

రాష్ట్రీయం
01) కరీంనగర్ టు ముంబై లోకమాన్య తిలక్ రైలు పొడగింపునకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ లో ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెన్
02) ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్ల రూసా నిధులు మంజురు అయ్యాయి. రూసా అంటే ఏంటి ?
జ: రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్
03) ప్రయాణీకులకు సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98శాతం మెరుగైన స్కోరు సాధించిన సంస్థగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. ఏ సంస్థ దీనిపై సర్వే నిర్వహించింది ?
జ: మెట్రో ప్రాజెక్ట్ నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్ )

జాతీయం
04) పాన్ కార్డ్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రాయితీలకు ఆధార్ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు ?
జ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర
05) ప్రపంచంలో పర్యావరణ మార్పులకు నిరంతర కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ‘‘చాంపియన్స్ఆఫ్ ది ఎర్త్’’ అవార్డును ప్రకటించిన సంస్థ ఏది ?
జ: ఐక్యరాజ్య సమితి
06) ఏసీలు, చెప్పులు, వజ్రాలతో పాటు ఎన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది ?
జ: 18 వస్తువులపై
07) 5G సేవలు, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్,యంత్రాల మధ్య సమాచార మార్పిడి తదితర లక్ష్యాలతో నాలుగేళ్ళల్లో రూ.7.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించేందుకు జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం 2018 ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టెలికాం మంత్రి ఎవరు ?
జ: మనోజ్ సిన్హా
08) చెరుకు రైతులు, మిల్లులకు సబ్సిడీ ఇచ్చేందుకు పంచదార రంగానికి కేంద్ర ఎంత మొత్తం ప్యాకేజీ ప్రకటించింది ?
జ: రూ.5,538 కోట్లు
09) లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల రుణ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించిన పోర్టల్ ఏది ?
జ: www.psbloansin59minutes.com
(నోట్: గతంలో రూ.1కోటి రుణం ఇస్తారు )
10) రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి తమిళనాడులోని రామేశ్వరంకు రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఆ రైలు పేరేంటి ?
జ: హమ్ సఫర్
11) భారత వైద్య మండలి (MCI) రద్దు చేసిన దాని స్థానంలో బోర్డ్ ఆప్ గవర్నర్స్ ను కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేసింది. అయితే MCIకి బదులు ఏ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ?
జ: నేషనల్ మెడికల్ కమిషన్
12) భూమి, వాతావరణం, సాగర, గ్రహాధ్యయన శాస్త్రం కేటగిరీలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (2018)కి ఎంపికైన తెలుగు శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ మాదినేని వెంకటరత్నం
13) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశం నుంచి ఆకాశంలోని సుదూర లక్ష్యాలను చేధించగల ఏ క్షిపణిని సుఖోయ్ నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించారు ?
జ: అస్త్ర క్షిపణి
14) ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ ఎవరు ?
జ: మన్ ప్రీత్ సింగ్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5 గ్రాండ్ టెస్టులు (TM) సెకండ్ పేపర్ పై ప్రత్యేక శ్రద్ధ

పూర్తి వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి :

https://telanganaexams.com/gp-secy-mock/