Thursday, December 13

CURRENT AFFAIRS – SEPT 22

రాష్ట్రీయం
01) ఈనెల 27న శాసన మండలి సమావేశం జరుగుతోంది. గతంలో శాసనసభ రద్దయినా మండలి సమావేశాలు ఎప్పుడెప్పుడు కొనసాగాయి ?
జ: ఎప్పుడూ కొనసాగలేదు. ఇదే మొదటిసారి
(నోట్: నిబంధనల ప్రకారం మండలి ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య 6 నెలల లోపు ఉండాలి. అందుకే సమావేశం జరుగుతోంది )
02) రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంయుక్త ముఖ్య ఎలక్టోరల్ అధికారిగా ఎవరిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది ?
జ: ఆమ్రపాలి ( ప్రస్తుతం GHMC అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు )
03) ఆంధ్ర బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, CEO గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: జె. పకిరిసామీ
04) రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శిల్పాచార్యుడు ఎక్కా యాదగిరి రావుకి గౌరవ డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ ఏది ?
జ: గీతం యూనివర్సిటీ
05) యాసంగి పెట్టుబడి కోసం రైతులకు రెండో విడత రైతు బంధు చెక్కులు ఎప్పటి నుంచి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ?
జ: 2018 అక్టోబర్ 2 నుంచి
06) రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో గడ్డి మైదానాలు పెంచాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట ఏయే టైగర్ రిజర్వ్ లో గడ్డి మైదానాలను పెంచనున్నారు ?
జ: కవ్వాల్, అమ్రామాద్ టైగర్ రిజర్వ్ లో

జాతీయం
07) ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) పేరుతో వస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ను ప్రధాని నరేంద్ర మోడీ 2018 సెప్టెంబర్ 23న ఎక్కడ ప్రారంభించనున్నారు ?
జ: జార్ఖండ్ రాజధాని రాంచీలో
08) 2018-19లో భారత వృద్ది రేటు ఎంతగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది ?
జ.: 7.8శాతం
09) సొంతంగా వెహికిల్ నడిపే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని ఎంతకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి ( IRDA) ఆదేశాలు జారీ చేసింది ?
జ: రూ.15 లక్షలు ( ప్రీమియం రూ.750 చెల్లించాలి)
10) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: అనిల్ కుమార్ చౌదరి
11) విశాఖ ఉక్కు సీఎండీగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: పి.కె.రత్
12) దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ( జీవిత చరిత్ర) తో మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరేంటి ?
జ: ది ఐరన్ లేడీ
(నోట్: పేపర్ టేల్ పిక్చర్స్ పతాకంపై ప్రియదర్శిని ఈ సినిమాని నిర్మిస్తున్నారు )
13) 2018 సంవత్సరానికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఎవరెవరికి ప్రకటించారు ?
జ: విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను

అంతర్జాతీయం
14) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన వియత్నాం అధ్యక్షుడు ఎవరు ?
జ: ట్రాన్ డాయ్ క్వాంగ్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/