Sunday, February 23

CURRENT AFFAIRS – SEPT 2

రాష్ట్రీయం
01) ఇండియన్ పోస్ట్ పేమెంట్ తెలంగాణ బ్రాంచ్ ని హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ?
జ: గవర్నర్ నరసింహన్
02) మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో అత్యుత్తమ సేవలకు తెలంగాణ నుంచి జాతీయ అవార్డుకి ఎంపికైన రెండు జిల్లాలు ఏవి ?
జ: వికారాబాద్, కామారెడ్డి
03) స్వచ్ఛ సర్వేక్షణ్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది ?
జ: పెద్దపల్లి
04) ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అదనంగా ఎన్ని ప్రత్యేక శెలవులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ?
జ: 5 రోజులు
05) ఎక్స్ లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ 2018 అవార్డు దక్కించుకున్న విద్యుత్ ప్రాజెక్ట్ ఏది ?
జ: NTPC రామ గుండం ప్రాజెక్ట్
06) రాష్ట్ర ఉర్దూ అకడామీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మహమ్మద్ రహీముద్దీన్ అన్సారీ

జాతీయం
07) భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును ప్రస్తుత CJI ప్రతిపాదించారు ?
జ: జస్టిస్ రంజన్ గొగోయ్
(జీకేలో జస్టిస్ గొగొయ్ గురించి వివరాలు ఉన్నాయి. చూడగలరు )
08) ప్రస్తుత CJI జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం ఎప్పటితో ముగుస్తుంది ?
జ: 2018 అక్టోబర్ 2
09) ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఏడాది విశేష అనుభవాలపై పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: మూవింగ్ ఆన్... మూవింగ్ ఫార్వార్డ్
10) సెప్టెంబర్ ను కేంద్ర ప్రభుత్వం ఏ మాసంగా ప్రకటించింది ?
జ: పోషకాహార మాసం
11) 2018 డిసెంబర్ లో ప్రయోగించే GSLV F-11 కు సంబంధించి క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెప్ట్ హాట్ టెస్ట్ ను ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారు ?
జ: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ )
12) HAL సీఎండీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
జ: ఆర్. మాధవన్
13) మిస్ దివా యూనివర్స్ 2018 కిరీటం గెలుచుకొని ఈ ఏడాడి డిసెంబర్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పోటీ పడనున్న అందాల సుందరి ఎవరు ?
జ: నేహల్ చుడాసమా
14) ఢిల్లీలో మరణించిన తరుణ్ మహరాజ్ ఎవరు ?
జ: జైన మత గురువు
15) ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ ఆటలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో గెలుపొందిన జోడీ ఎవరు ?
జ: ప్రణబ్ బర్దన్, శిశ్ నాథ్ సర్కార్
16) ఏషియాడ్ లో దేశం తరపున పతకం గెలిచిన పెద్ద వయస్కుడిగా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ:: ప్రణబ్
17) బాక్సింగ్ 49 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్న హరియాణా బాక్సర్ ఎవరు ?
జ: అమిత్ సంఘాల్

అంతర్జాతీయం
18) ఏ దేశ సరిహద్దుల్లో 60 కిమీ పొడవు, 200 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వాలని సౌదీ అరేబియా నిర్ణయించింది ?
జ: ఖతార్

పంచాయతీ కార్యదర్శి కి మాక్ టెస్టులు
100మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
https://telanganaexams.com/gp-secy-mock/