Sunday, August 25

CURRENT AFFAIRS – SEPT 19

రాష్ట్రీయం
01) కేంద్ర యువజన సంక్షేమ శాఖ ప్రతిష్టాత్మక తెన్ సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం 2017 కి ఎంపికైన భారతీయ నౌకాదళ లెఫ్టినెంట్ కమాండర్ ఎవరు ?
జ: బొడ్డపాటి ఐశ్వర్య (తెలంగాణకి చెందిన అధికారిణి)
02) బోగస్ ఓటర్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రాష్ట్రంలో ఉపయోగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెబుతున్నారు. ఆ సాఫ్ట్ వేర్ ఏది ?
జ: ERO NET

జాతీయం
03) బంగ్లాదేశ్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఏ పేరుతో పైప్ లైనును భారత్, బంగ్లా ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా ప్రారంభించారు ?
జ: ఫ్రెండ్ షిప్ పైప్ లైన్
(నోట్: 130 కిమీలు, ప్రాజెక్టు వ్యయం: రూ.346 కోట్లు )
04) క్షయ వ్యాధి పీడిత 30 దేశాల్లో భారత్ స్థానం ఎంతగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో పేర్కొంది ?
జ: మొదటి స్థానం
(నోట్: 2017లో కోటి మంది ఈ వ్యాధి బారిన పడితే 27లక్షల మంది భారత్ లో ఉన్నారు )
05) పోషకాహార లోపంతో ప్రపంచంలో అత్యధికంగా శిశు మరణాలు ఏ దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి ?
జ: భారత్ లో ( 8.02 లక్షల మంది 2017లో)
06) ఒకప్పుడు టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన ఏ దిగ్గజ సంస్థ ఆ రంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది ?
జ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ( ఆర్ కామ్ )
07) ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించిన క్రీడాకారుడు ఎవరు ?
జ: విజయ్
08) భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ కి స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకొచ్చిన ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ ఏది ?
జ: అడిడాస్

అంతర్జాతీయం
09) పేద దేశాలకు మేలు చేసే విధానాలు రూపొందించే దేశాల్లో అమెరికా వెనుకబడింది. కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ (అభివృద్ధి నిబంధత సూచీ)లో ఆ దేశం స్థానం ఎంత ?
జ: 23 (మొత్తం 27 ధనిక దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు )
10) చంద్రుడి చుట్టూ పర్యాటకులను తిప్పే ప్రాజెక్టును ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చేపడుతోంది. అందుకోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించిన జపాన్ బిలియనీర్ ఎవరు?
జ: యుసాకు మేజావా

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/