Wednesday, September 18

CURRENT AFFAIRS – SEPT 18

రాష్ట్రీయం
01) రూ.300కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు మైక్రాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: మాదాపూర్
02) రాష్ట్రంలో రెండో విడత రైతు బంధు చెక్కులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ?
జ: 2018 నవంబర్ 17నుంచి
03) 24 గంటలూ సౌరశక్తిని నిల్వ చేసి వినియోగించే లిథియం ఇరన్ పాస్ఫేట్ బ్యాటరీలను రూపొందించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఏది ?
జ: ప్యూర్ ఎనర్జీ

జాతీయం
04) దేశంలో మరో మూడు బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఆ బ్యాంకులు ఏవి ?
జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్
05) హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన ఏపీకి చెందిన ఎవరిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సన్మానించారు ?
జ: పావులూరి శివరామ కృష్ణయ్య
06) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ సంఘం (DDCA) క్రికెట్ కమిటీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ ఎవరు ?
జ: వీరేంద్ర సెహ్వాగ్

అంతర్జాతీయం
07) 2017లో ప్రపంచంలో పోషకాహారం, ఆకలి లేమితో ఎంతమంది మరణించినట్టు ప్రపంచ ఆహార భద్రత, పౌష్టికాహార స్థితి - 2018 నివేదిక వెల్లడించింది ?
జ: 82.1 కోట్ల మంది
08) ఏ ఏడాదిలోగా జీరో హంగర్ ( ఆకలి లేని ప్రపంచం) సాధన దిశగా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది ?
జ: 2030 నాటికి
09) కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు హైడ్రోజన్ తో నడిచే రైలును రూపొందించిన దేశం ఏది ?
జ: జర్మనీ
10) అథ్లెటిక్స్ లో క్లిష్టమైన ఈవెంట్స్ లో ఒకటైన పురుషుల డెకాథ్లాన్ లో రికార్డు సృష్టించిన ఫ్రాన్స్ అథ్లెట్ ఎవరు ?
జ: కెవిన్ మాయెర్
(నోట్: డెకాస్టర్ ఈవెంట్ లో మాయెర్ 9,126 పాయింట్లతో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు )
11) అమెరికాకి చెందిన ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ను రూ.1377 కోట్లకు అమ్ముతున్నారు. ఈ సంస్థ యజమని ఎవరు ?
జ: క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు ఛైర్మన్ మార్క్స్ బెనియాఫ్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/