Friday, February 21

CURRENT AFFAIRS – SEPT 16 & 17

రాష్ట్రీయం
01) 2018 సెప్టెంబర్ 16 నాడు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రను హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ?
జ: ఐటీ మంత్రి కేటీఆర్
02) 2018 సెప్టెంబర్ 17తో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయి 70యేళ్ళు అవుతుంది. విలీనం అయిన తేదీ ఏది ?
జ: 1948 సెప్టెంబర్ 17
03) భారత్ లో విలీనం అంశాన్ని 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ రేడియో ద్వారా ప్రకటించారు ?
జ: హైదరాబాద్ రేడియో
04) భారత సైన్యాధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపోయిన హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి ఎవరు ?
జ: అల్ ఇద్రూస్
05) 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సైనిక గవర్నర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి
06) మేఘాలయలోని షిల్లాంగ్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న నృత్యకారిణి ఎవరు ?
జ: భావనా రెడ్డి
07) ఈసారి ఎన్నికల్లో ఒకే కంట్రోల్ యూనిట్ లో 384 మంది అభ్యర్థుల గుర్తులు ఉండేలా EVM లను తయారు చేస్తున్నారు. వీటిని ఏమంటారు ?
జ: థర్డ్ జనరేషన్ మెషిన్లు ( M3)
08) తాపీ ధర్మారావు జీవన సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
జ: సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్
09)వీవీ నాథూ స్మారక అఖిలభారత సీనియర్ల ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సింగిల్స్ టైటిల్స్ విజేత అయిన హైదరాబాద్ ఆటగాడు ఎవరు ?
జ: రాహుల్ యాదవ్

జాతీయం
10) ప్రధానమంత్రి కృషి సించయి యోజన (PMKSY) కింద వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న93 సాగునీటి ప్రాజెక్టులకు రూ.65,634.93 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన బ్యాంకు ఏది ?
జ: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ( నాబార్డ్ )
11) ఎన్నికల్లో జరిగే అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న యాప్ ఏది ?
జ: సీ విజిల్
12) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్ )నుంచి PSLV C42 ప్రయోగం విజయవతమైంది. ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలను పంపారు ?
జ: బ్రిటన్
13) 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసుపై ‘‘రెడీ టూ ఫైర్ : హౌ ఇండియా అండ్ ఐ సర్వైవ్డ్ ద ఇస్రో స్పై కేస్ ’’ పేరుతో పుస్తకం రాసింది ఎవరు ?
జ: మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్
14) సిలెసియాన్ మహిళల అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్ నుంచి స్వర్ణం సొంతం చేసుకున్న బాక్సర్ ఎవరు ?
జ: మేరీ కోమ్

అంతర్జాతీయం
15) ప్రపంచవ్యాప్తంగా కరిగిపోతున్న మంచుపై అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన అత్యాధునిక స్పేస్ లేజర్ ఆధారిత ఉపగ్రహం పేరేంటి ?
జ: ఐస్ శాట్ - 2
( నోట్: జీకేలో వివరాలు ఉన్నాయి. చూడగలరు )
16) పురుషుల అథ్లెటిక్స్ లో అంత్యంత క్లిష్లమైన రేసు మారథాన్ లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. బెర్లిన్ మారథాన్ లో స్వర్ణ పతకం సాధించిన కెన్యన్ ఎవరు ?
జ: ఎలియుడ్ కిప్ చోగే
17) ఫిలిప్పీన్స్ ను గడ గడలాడిస్తున్న భారీ టైఫూన్ పేరేంటి ?
జ: మంగ్ ఖుట్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/