Tuesday, November 13
Log In

CURRENT AFFAIRS – SEPT 08

రాష్ట్రీయం
01) రాష్ట్రానికి అవసరమైన EVM, VVPAT లు బెంగళూరులో ఎక్కడ తయారవుతున్నాయి ?
జ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్ )
02) రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు ?
జ: డాక్టర్ రజత్ కుమార్
03) రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కమిషనర్ గా ఎవర్ని నియమించారు ?
జ: డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్
04) 2018 సంవత్సరానికి కాళోజీ నారాయణ రావు పురస్కారంను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది ?
జ: అంపశయ్య నవీన్
(నోట్: నవీన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జన్మించారు. కాలరేఖలు ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది )
05) గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వనరులు కల్పించినందుకు ఏ స్కీమ్ కింద తెలంగాణని ఉత్తమ రాష్ట్రంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఎంపిక చేసింది ?
జ: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్భన్ మిషన్ పథకం
06) రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ తరహాలో కర్ణాటకలో ఏ పేరుతో పథకం అమలుకు సాంకేతిక సాయం కోరారు ?
జ: జలధారే

జాతీయం
07) ప్రపంచ రవాణా సదస్సు (గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్) ఎక్కడ జరిగింది ?
జ: న్యూఢిల్లీలో
08) నీతి ఆయోగ్ ఆద్వర్యంలో ఢిల్లీలో జరిగిన గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
09) ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ?
జ: ఓపీ రావత్
10) షేడ్స్ ఆఫ్ ట్రూత్ - అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: కపిల్ సిబల్
11) రసాయన శాస్త్రంలో విశిష్ట పరిశోధనలు చేసినందుకు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కాంస్య పతకం అందుకున్న IICT శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ చంద్రశేఖరం
12) దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో లేజర్ కంచెను సరిహద్దు భద్రతా దళం నిర్మిస్తోంది ?
జ: ధుబ్రి ప్రాంతంలో (55-60 కిమీ)
13) ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వర్ణం గెలుచుకున్నది ఎవరు ?
జ: హృదయ్ హజారికా
14) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వర్ణం గెలుచుకున్న భారత జట్టులో షూటర్స్ ఎవరు ?
జ: ఎలవెనిల్, మానిని కౌశిక్, శ్రేయ అగర్వాల్
15) దిండిగల్ లో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచినది ఎవరు ?
జ: ఇండియా బ్లూ
(నోట్: డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా రెడ్ ను ఓడించింది )

పంచాయతీ సెక్రటరీలకు 100 మాక్ టెస్టులు + 10గ్రాండ్ టెస్టులు (ఇందులో రెండు పేపర్లకు సంబంధించిన ప్రశ్నలు కవర్ అవుతాయి )

https://telanganaexams.com/gp-secy-mock/