Monday, December 17

CURRENT AFFAIRS – SEPT 06

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానంతో కంపెనీల స్థాపనకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ అవార్డు లభించింది ?
జ: ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డ్
02) కమలాపూర్ లోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - బిల్ట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థను గతంలో ఏమని పిలిచేవారు ?
జ: కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ
03) సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ పథకాన్ని ఎన్ని వేల కోట్లు కేటాయించారు ?
జ: రూ.1000 కోట్లు
04) భూసేకరణ చట్టం 2013 నుంచి రాష్ట్రంలోని ఏ సంస్థకు మినహాయింపు ఇచ్చారు ?
జ: సింగరేణి కాలరీస్

జాతీయం

05) భారత్ - అమెరికా 2+2 చర్చల్లో భాగంగా విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశం 2018 సెప్టెంబర్ 6 నుంచి ఢిల్లీలో జరుగుతోంది. ఇందులో పాల్గొంటున్న అమెరికా మంత్రులు ఎవరు ?
జ: రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, విదేశాంగమంత్రి మైక్ పాంపియో
06) హిందూ మహిళలు దేవాలయాలను సందర్శించడాన్ని అభ్యంతరకరంగా వర్ణించారంటూ విమర్శలు వస్తున్న ఏ పుస్తకం వివాదస్పదం అవుతోంది. రచయిత్రి ఎవరు ?
జ: మీషా ( మలయాళం ) , రచయిత్రి: ఎస్ హరీశ్
(నోట్: ఈ పుస్తకాన్ని నిషేధించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది )
07) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఎంత మొత్తానికి పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: రూ.10 వేలు ( గతంలో రూ.5 వేలు )
( జన్ ధన్ యోజనకు సంబంధించిన మరిన్న వివరాలు జనరల్ నాలెడ్జ్ విభాగంలో చూడగలరు )
08) లైంగిక, యాసిడ్ దాడుల బాధిత మహిళలకు 2018 అక్టోబర్ 2 నుంచి ఎంత మొత్తం పరిహారంగా ప్రభుత్వం ఇవ్వనుంది ?
జ: రూ.4లక్షలు
09) రాఫెల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదర్చుకుంది ?
జ: ఫ్రాన్స్
10) దక్షిణ కొరియాలోని ఛాంగ్ వాన్ లో అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో 10.మీ ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ లో కాంస్యం సాధించింది ఎవరు ?
జ: దివ్యాంశ్ సింగ్ - శ్రేయ అగర్వాల్

అంతర్జాతీయం
11) జపాన్ ని వణికిస్తున్న తుఫాన్ పేరేంటి ?
జ: జెబీ తుఫాన్

MOCK TESTS @TELANGANA EXAMS

SI/PC/VRO/GR.IV/ పంచాయతీ కార్యదర్శి మాక్ /గ్రాండ్ టెస్టుల వివరాలు

https://telanganaexams.com/mock-tests-2/