Monday, September 23

CURRENT AFFAIRS – SEPT 01

రాష్ట్రీయం
01) కాళేశ్వరంలో ప్యాకేజీ - 6లో 124.4 మెగావాట్ల పంపు డ్రై రన్ ను ఎవరు ప్రారంభించారు ?
జ: మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్
02) రాష్ట్రంలో శునకాల కోసం ప్రత్యేకంగా ఎక్కడ పార్కును నిర్మించారు ?
జ: కొండాపూర్ (హైదరాబాద్ ) 1.2 ఎకరాల విస్తీర్ణంలో
03) రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ?
జ: 2,61,36,776 మంది
( పూర్తి వివరాలు జీకే ఇవ్వబడును)
04) మెరుగైన యాజమాన్య నిర్వహణ విధానంలో ISO గుర్తింపు దక్కించుకున్న విద్యా సంస్థ ఏది ?
జ: రాష్ట్ర గిరిజన గురుకుల సొసైటీ

జాతీయం
05) 2019 సెప్టెంబర్ 1 నాడు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ను ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: తల్కతోరా స్టేడియం, న్యూ ఢిల్లీ
06) ఏ సంవత్సరంలో జరిగే జనాభా లెక్కల్లో ఓబీసీల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2021లో
07) ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని ప్రతి మూడేళ్ళకోసారి మార్చాలని ఎవరు ఆదేశించారు ?
జ: కేంద్ర విజిలెన్స్ కమిషన్ ( CVC)
08) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ( IBA) ఛైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: సునీల్ మెహతా
09) ఐడియా, వొడాఫోన్ విలీనంతో దేశంలో మెగా టెల్కోగా అవతరించింది. కొత్త కంపెనీ పేరేంటి ?
జ: వొడాఫోన్ ఐడియా
10) ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత్ కు రజిత పతకం దక్కింది. ఫైనల్లో ఏ జట్టుపై ఓడి పోయింది ?
జ: జపాన్ చేతిలో ( 1-2 తేడాతో )
11) బుడా పెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో (57కేజీల) స్వర్ణ పతకం గెలుచుకున్నది ఎవరు ?
జ: సాక్షి