Wednesday, October 23

CURRENT AFFAIRS QUIZ – AUG 16

ఈ క్విజ్ టెస్టును యాప్ లో రాయడం కుదరు... ఈ లింక్ క్లిక్ చేసి వెబ్ సైట్ లో రాసుకోగలరు

http://telanganaexams.com/ca-quiz-aug-16/

1. భారత్ చమురు అవసరాలకు సంబంధించిన ఈ వాక్యాల్లో ఏది తప్పుగా చెప్పబడింది

ఎ) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన చమురు - రసాయనాల విభాగంలో 20శాతం వాటాను సౌదీ సంస్థ అరామ్ కో కొనుగోలు చేయనుంది
బి) ఈ కొనుగోలు ఒప్పందంతో భారత్ కు అతి పెద్ద చమురు సరఫరాదారుగా సౌదీ అరేబియా నిలవనుంది
సి) ప్రస్తుతం భారత్ కు అతిపెద్ద చమురు సరఫరాదారు కువైట్
డి) భారత్ తన ముడిచమురు అవసరాల్లో 80శాతం దిగుమతి చేసుకుంటోంది.

2. 01) ప్రధాన నరేంద్రమోడీ 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అంశాల్లో సరైనవి

ఎ) భారత మాల, సాగరమాల ప్రాజెక్టుతో పాటు ఆధునిక బస్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు, ఆధునిక ఆస్పత్రుల నిర్మాణానికి రూ.100 లక్షల కోట్లతో మౌలిక వసతుల కల్పన
బి) ఇంటింటికీ నీరందించేలా జలజీవన్ మిషన్ కోసం రూ.3.50 లక్షల ఖర్చు పెట్టబోతున్నారు
సి) భారత త్రివిధ దళాలను శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ - CDS) ను ఏర్పాటు చేయబోతున్నారు
డి) ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) ను 2019 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి నుంచి బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు

3. మహర్షి భద్రాయణ్ వ్యాస్ సమ్మాన్ పురస్కారంనకు సంబంధించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి
ఎ) క్లాసికల్ తెలుగు విభాగంలో ప్రొ.అద్దంకి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక మహర్షి వ్యాస్ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు
బి) శ్రీనివాస్ తెలుగులో అనువాద రచనలు చేశారు. 400కు పైగా వ్యాసాలు, 62 పత్ర సమర్పణలు, 500కు పైగా కవితలు, 76 గ్రంథాలు రాశారు
సి) వినరో భాగ్యము విష్ణుకథ పేరుతో విష్ణుతత్వంపై వ్యాస సంకలనం రాశారు
డి) సిలికానాంధ్ర యూనివర్సిటీ తెలుగు బోధకులుగా పనిచేస్తున్నారు

4. భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీ చంద్ కు ఇటీవల ఏ ఐఐటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది

5. అబ్దుల్ కలాం పురస్కారానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు
ఎ) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిపతి, రాకెట్ మేన్ గా పేరున్న డాక్టర్ కైలాసవాడివో శివన్ కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం పురస్కారం ప్రకటించింది
బి) శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో చొరవ చూపినందుకు గుర్తింపు
సి) శివన్ ఏపీలోని శ్రీహరి కోటకు చెందిన వారు
డి) 1983 నుంచి ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి వివిధ హోదాల్లో పనిచేశారు

6. CDS (రక్షణ బలగాల అధిపతి)కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి (చాలా ఇంపార్టెంట్ బిట్ )

ఎ) త్రివిధ దళాలైన సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు కలిపి ఉమ్మడిగా రక్షణ బలగాల అధిపతి పదవిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు
బి) 1999లో భారత్ - పాక్ కార్గిల్ యుద్ధం తర్వాత దేశ భద్రతా వ్యవస్థపై లోపాలను పరిశీలనకు ఏర్పడ్డ సుబ్రమణ్యం కమిటీ ఈ పదవిని తొలిసారిగా సిఫార్సు చేసింది
సి) 2001లో ఏర్పడ్డ మంత్రుల బృందం కూడా ఈ ప్రపోజల్ కి మద్దతు తెలిపింది
డి) CDS పై అపోహలు తొలగడానికి 2012లో నరేశ్ చంద్ర కమిటీ COSC కి శాశ్వత అధిపతి పదవిని సృష్టించాలని సూచించింది
ఇ) 2016లో ఏర్పడ్డ లెఫ్టినెంట్ జనరల్ డి.బి. షెకత్కార్ కమిటీ కూడా CDS కమిటీ ఏర్పాటుకు సిఫార్సు చేసంది.

7. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 50యేళ్ళు పూర్తి చేసుకుంది. ఇస్రోని ఎప్పుడు స్థాపించారు

8. భూ గ్రహ చరిత్రలోనే ఏ ఏడాదిలో ఏ నెల అత్యంత వేడి మాసంగా రికార్డయింది

9. భారత్ చమురు అవసరాలకు సంబంధించిన ఈ వాక్యాల్లో ఏవి సరైనవి

ఎ) 2040 కల్లా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న చమురు వినియోగ విపణిగా భారత్ అవతరించనుంది
బి) ప్రస్తుతం దేశంలో 5 మిలియన్ బ్యారెళ్ళ చమురు వినియోగం జరుగుతోంది. 2035 కల్లా 8.2 మిలియన్ల బ్యారెళ్ళకి పెరిగే అవకాశం
సి) ఈ ఏడాది భారత్ లో చమురు గిరాకీ రోజుకి 1.70 లక్షల బ్యారళ్ళ మేర పెరుగోతంది. 2020 కల్లా గిరాకీ వృద్ధి 2.25 లక్షల బ్యారెళ్ళకు చేరు అవకాశం

10. KVS బాబు IFS స్మారక అవార్డులను ఈ కింది వారిలో ఎవరికి ప్రదానం చేశారు. ( మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది )

1) సీహెచ్ అనిత (కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి)
2) సురేష్ కుమార్ ( నెల్లూరు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి)