Thursday, September 19

CURRENT AFFAIRS – OCT 31

తెలంగాణ
01) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తెలంగాణకి చెందిన న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి
02) దేశానికి విత్తన భాండాగారంగా తెలంగాణ మారుతోంది. ప్రపంచ విత్తన రంగంలో భారత్ అభివృద్ధి రేటు 5శాతం. మన దేశంలో రాష్ట్రం వాటా ఎంతగా ఉంది ?
జ: 15శాతం
03) చైనాకి చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ ఎక్కడ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది ?
జ: హైదరాబాద్ లో

జాతీయం
04) రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలని భారత్ - ఇటలీ నిర్ణయించుకున్నాయి. భారత్ లో పర్యటిస్తున్న ఇటలీ ప్రధాని ఎవరు ?
జ: జుసపె కాంటే
05) గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎత్తు ఎంత ?
జ: 182 మీటర్లు ( దాదాపు 597 అడుగులు. వ్యయంఫ రూ.2,989 కోట్లు)
06) దేశీయంగా రూపొందించిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 ను భారత్ విజయవంతంగా రాత్రి వేళల్లో ప్రయోగించింది. ఈ ప్రయోగం ఎక్కడ జరిగింది ?
జ: ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవిలో

అంతర్జాతీయం
07) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా అద్భుత సూపర్ సోనిక్ పారాచూట్ ని ఆవిష్కరించింది. ఇది 0.4 సెకన్ వ్యవధిలో విచ్చుకుంటుంది. ఎన్ని కిలోల బరువును మోయగలదు ?
జ: 37 వేల కిలోలు
08) సూర్యుడి ఉపరితలానికి అత్యంత దగ్గరగా వెళ్ళిన మానవ నిర్మిత యంత్రంగా ఏది చరిత్ర సృష్టించింది ?
జ: పార్కర్ ప్రోబ్
09) గతంలో 1976లో సూర్యుడికి భానుడి ఉపరితలానికి 25.66 మిలియన్ మైళ్ళ దూరం వరకూ వెళ్ళిన వ్యోమ నౌక ఏది ?
జ: హీలియోస్ - 2 ( జర్మనీ - అమెరికా నౌక )

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/