Tuesday, November 13
Log In

CURRENT AFFAIRS – OCT 28 & 29

తెలంగాణ
01) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్ 29న మూస్తున్నారు. అయితే ప్రతి యేటా ఎప్పుడు బాబ్లీ గేట్లను తెరుస్తారు ?
జ: జులై 1నాడు
02) అసోంలో జరుగుతున్న జాతీయ ఆరోగ్య సదస్సులో ఏ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రదర్శన ఇవ్వనుంది ?
జ: మాతా శిశు సంక్షేమం, కంటి వెలుగు

జాతీయం
03) ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవిత విశేషాలతో మహావ్యక్తి - మహా వక్త - పుస్తకం రాసినది ఎవరు ?
జ: కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్
04) ఢిల్లీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా మరణించారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ సీఎంగా పనిచేశారు ?
జ: 1993-1996 మధ్య ( 2004లో రాజస్థాన్ గవర్నర్ గా కూడా పనిచేశారు )
05) తీర గస్తీ దళ విమానాల ఆధునీకరణకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. 17 డోర్నియర్ విమానాలను ఆధునీకరించనున్నారు. రూ.950కోట్ల ఖర్చయ్యే ఈ ఆధునీకరణ పనులను ఏ సంస్థకి అప్పగించారు ?
జ: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
06) ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరక్టర్ గా ఎవరిని కేంద్రం నియమించింది ?
జ: సంజయ్ కుమార్ మిశ్రా
07) వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏయే దేశాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి ?
జ: భారత్, పాకిస్తాన్

అంతర్జాతీయం
08) ప్రపంచంలోనే అతి పెద్దదైన విమానాశ్రయం ఎక్కడ నిర్మించారు ?
జ: ఇస్తాంబుల్
(నోట్: గణతంత్ర రాజ్యాంగా టర్కీ ఆవిర్భవించి 95యేళ్ళయిన సందర్భంగా నిర్మించారు )
09) సిరియా కన్నా పాకిస్తానే ప్రమాదకరమనీ, అక్కడి ఉగ్రవాదులతో మానవాళికే ముప్పు అని ఎవరు నివేదిక ఇచ్చారు ?
జ: ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, స్ట్రాటజిక్ ఫోర్ సైట్ గ్రూప్ సంయుక్త నివేదిక
10) రాజకీయ సంక్షోభంతో శ్రీలంక పార్లమెంటును 2018 నవంబర్ 16 వరకూ సస్పెండ్ లో ఉంచారు. ప్రస్తుతం ఆ దేశాధ్యక్షుడు ఎవరు ?
జ: మైత్రిపాల సిరిసేన