Thursday, September 19

CURRENT AFFAIRS – OCT 26

రాష్ట్రీయం
01) ఉత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆసియా ర్యాంకింగ్ సర్వేలో HCU కి ఎన్నో స్థానం దక్కింది ?
జ: 106 వ స్థానం
(నోట్: బ్రిటీష్ సంస్థ QS ఈ సర్వే నిర్వహించింది. ఆసియా ఖండంలోని 500 ఉన్నత విద్యా సంస్థల్లో HCU కి ఈ ర్యాంక్ దక్కింది )
02) ప్రముఖ హాస్య రచయిత కవన శర్మ (80) బెంగళూరులో చనిపోయారు. ఆయన 2007లో రాసిన సైన్సు నడిచిన బాట పుస్తకానికి మంచి గుర్తింపు వచ్చింది. కవన శర్మ పూర్తి పేరేంటి ?
జ: కందుల వరాహ నరసింహ శర్మ

జాతీయం
03) ప్రధాని నరేంద్రమోడీకి అక్టోబర్ 28నాడు జపాన్ ప్రధాని ప్రైవేటు విందు ఇస్తున్నారు. ఒక విదేశీ నాయకుడికి ఇలాంటి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. విందు ఇస్తున్న జపాన్ ప్రధాని షింజో అబే వ్యక్తిగత నివాసం ఏది ?
జ: యమనషి
04) దేశంలో మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు పథకాలేవి ?
జ: ఇంప్రెస్ (సామాజిక శాస్త్రాల్లో ప్రభావవంత విధానాల పరిశోధన)
స్పార్క్ ( విద్యా సంబంధిత, పరిశోధనల్లో తోడ్పాటుకి పథకం )
05) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవ్యలోటు ఎంతగా నమోదైంది
జ: రూ.5.94 లక్షల కోట్లు
06) బుడా పెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 57 కేజీల విభాగంలో కాంస్యపతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు ?
జ: పూజ దండా

అంతర్జాతీయం
07) కేంబ్రిడ్జ్ అనలిటికాకి లీకేజీ చేసిన కేసులో ఫేస్ బుక్ కు బ్రిటన్ ఎంత జరిమానా విధించింది ?
జ: రూ.4.71 కోట్లు
08) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఎవరు ?
జ: డ్వేన్ బ్రావో
09) ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం సందర్భంగా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. శాంతి-అహింస సంప్రదాయం థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఎవరు?
జ: అంజాద్ అలీ ఖాన్
10) అమెరికా ఫెడరల్ ఇంధన నియంత్రణ కమిషన్ (ఫెర్క్) ఛైర్మన్ గా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
జ: నీల్ ఛటర్జీ

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు

మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం

అక్టోబర్ 31లోపు ఫీజులు చెల్లిస్తే 200 మాక్ టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/