Thursday, September 19

CURRENT AFFAIRS – OCT 24

రాష్ట్రీయం
01) దేశంలోనే మొదటిసారిగా బ్రెయిలీ లిపిలో ఓటర్లు కార్డులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఎక్కడ పంపిణీ చేశారు ?
జ: హైదరాబాద్ లో
02) దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు సహాయపడే ఎన్నికల సంఘం తెచ్చిన మొబైల్ యాప్ ఏది ?
జ: వాదా ( ఓటర్ యాక్సెస్ బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ )
03) షీసెల్స్ లో పండ్లు, కూరగాయల పంటల సాగుకి తెలంగాణ సహకారం తీసుకుంటామంటున్న ఆ దేశ వ్యవసాయ మంత్రి ఎవరు ?
జ: చార్లెస్ బాస్టేన్ (రాష్ట్ర పర్యటనకు వచ్చారు )
04) కె.సి.మెహతా స్మారక అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు ?
జ: HCU వైస్ ఛాన్స్ లర్ ప్రొ.పి.అప్పారావు

జాతీయం
05) దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ టపాసులపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ కాల్చుకోడానికి పర్మిషన్ ఇచ్చింది ?
జ: దీపావళి, ఇతర పండగలకు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు
కొత్త సంవత్సరం, క్రిస్మస్ కి రాత్రి 11.55 గం. నుంచి 12.30 గం వరకూ
06) దేశంలో ఎన్నికలు నిర్వహించే అధికారం, పర్యవేక్షణకు ఎన్నికలసంఘానికి అప్పజెబుతూ రాజ్యాంగంలో ఉన్న నిబంధన ఏది ?
జ: 324
07) ఇంజన్ లేని రైలుబండిని ట్రైన్ - 18 పేరుతో ట్రైన్ సెట్ ను చెన్నైలో ఎవరు తయారు చేశారు ?
జ: ICF
08) చెన్నైలో తయారైన ట్రైన్ సెట్ గంటకి ఎన్నికిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు ?
జ: 220 కి.మీ.
09) భారతీయుల్ని పెళ్ళాడే వారు కూడా దేశంలోకి బహుళ ప్రవేశం, దేశాన్ని సందర్శించేందుకు జీవిత కాలం వీసా లాంటి సౌకర్యాలతో కూడి OCI ని ఇస్తామని కేంద్రం ప్రకటించింది. OCI అంటే ఏంటి ?
జ: ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా
10) హిమాలయ వయాగ్రా అని పిలుచుకునే శిలీంధ్రం అంతరించిపోయే ముప్పు ఏర్పడిందని ఓ అంతర్జాతీయ సైన్స్ మేగజైన్ వెల్లడించింది. ఆ శిలీంధ్రం పేరేంటి ?
జ: యార్చగుంబ (ఓఫియో కార్డైసెప్స్ సైనెసిస్ )
11) జాతీయ ఎలక్ట్రానిక్స్ ముసాయిదా- 2018ను ప్రకటించారు. 2025 నాటికి దేశీయంగా ఎన్ని కోట్ల మొబైల్ ఫోన్లు తయారీ లక్ష్యంగా ముసాయిదాలో ప్రకటించారు ?
జ: 100 కోట్లు

అంతర్జాతీయం
12) ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనగా గుర్తింపు పొందిన హాంకాంగ్ - జుహయిని ఎవరు ప్రారంభించారు ?
జ: చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్
13) టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయంలో అనుమానస్పద రీతిలో చనిపోయిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ ఏ పత్రికకు చెందినవారు ?
జ: వాషింగ్టన్ టైమ్స్

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు

మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం

అక్టోబర్ 31లోపు ఫీజులు చెల్లిస్తే 200 మాక్ టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/