Thursday, September 19

CURRENT AFFAIRS – OCT 22 & 23

రాష్ట్రీయం
01) 2019 జనవరి 22 నుంచి 25 వరకూ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న రాష్ట్ర మంత్రి ఎవరు ?
జ: కె.టి.రామారావు
02) ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఎంత మొత్తాన్ని రాష్ట్రానికి ఇప్పటిదాకా అందజేసింది ?
జ: రూ.190.76 కోట్లు
(నోట్: 2016-17 కి 50,959 ఇళ్ళు, 2017-18 సం. 19,715 ఇళ్ళు మొత్తం: 70,674 ఇళ్ళ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది )
03) ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఆవిష్కరించిన జాతీయ పోలీస్ స్మారక చిహ్నాన్ని మన రాష్ట్రంలోని ఏ ప్రాంతం గ్రానైట్ తో తయారు చేశారు ?
జ: ఖమ్మం
(నోట్: 31 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్ ఇది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వు మాదారం క్వారీ నుంచి దీన్ని సేకరించారు )
04) విద్యుత్ వాడకంలో దేశంలోనే తెలంగాణకి 7వ స్థానం ఉంది. రోజుకి గరిష్టంగా ఎంత మెగావాట్ల వినియోగం జరుగుతోంది ?
జ: 10,818 మెగావాట్లు
05) కేంద్ర విద్యుత్ మండలి నివేదిక ప్రకారం తెలంగాణలో వార్షిక తలసరి విద్యుత్ వినియోగం ఎంతగా ఉంది ?
జ: 1,500 యూనిట్లు ( గత ఏడాది 1149 యూనిట్లు )
06) సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బోర్డు సభ్యులు ప్రొ.రమా మెల్కోటేకి ఏ అవార్డును ప్రదానం చేశారు ?
జ: లక్ష్మీ- వేణుగోపాలన్
07) హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం (యాదగిరి ) 41వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ కేంద్రంలో వార్తలను అధికారికంగా ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 1983 నవంబర్ 14న
08) ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోని అధిరోహించిన పాలమూరు డాక్టర్ ఎవరు ?
జ: డాక్టర్ మధుసూదన్ రెడ్డి
09) భారత మహిళల ఫుట్ బాల్ జట్టులో చోటు దక్కించుకున్న తెలంగాణ క్రీడాకారిణి ఎవరు ?
జ: గుగులోత్ సౌమ్య

జాతీయం
10) ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్ళలేని వారిని తీసుకెళ్లేందుకు ఉద్దేశించన కొత్త యాప్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్నారు. దాని పేరేంటి ?
జ: వాదా
11) భారత్ - చైనా యుద్ధం సందర్భంగా భారత సైన్యం కారణంగా భూములు కోల్పోయిన గ్రామస్థులకు 56యేళ్ల తర్వాత రూ.38కోట్ల నష్టపరిహారం అందింది. వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
12) పర్యావరణ మార్పు ప్రభావాలపై పోరాడేందుకు భారత్ లోని తీర ప్రాంతాలకు వారు రూ.319 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంస్థ ఏది ?
జ: ఐక్యరాజ్యసమితికి చెందిన హరిత పర్యావరణ నిధి (GCF)
(నోట్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాలకు ఈ నిధులను కేటాయిస్తారు )
13) సఫాయివాలా పేరును ఏ విధంగా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది ?
జ: హౌస్ కీపింగ్ స్టాఫ్
14) మొండి బాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ బ్యాంకులు ఎన్నో స్థానంలో ఉన్నట్టు మూడీస్ నివేదిక వెల్లడించింది ?
జ: రెండో స్థానం ( రష్యా బ్యాంకులు మొదటి స్థానం )
15) రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు (RIL) లో అదనపు స్వతంత్ర డైరక్టరుగా నియమితులైన SBI మాజీ ఛైర్మన్ ఎవరు ?
జ: అరుంధతీ భట్టాచార్య
16) దేశీయ టెలికాం దిగ్గజ సంస్ఘలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియాల అధిపతులు ముకేశ్, మిత్తల్, బిర్లా ఎక్కడ జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ఒకే వేదికపై కలవబోతున్నారు ?
జ: న్యూఢిల్లీలో జరిగే ( 2018 అక్టోబర్ 25 నుటగంచి 27 వరకూ )
17) త్వరలో బ్రిటన్ 50 పౌండ్ల నోటిపై భారత సంతతి మహిళ ( రెండో ప్రపంచ యుద్ధంలో సేవలకు) చిత్రాన్ని ప్రచురిస్తున్నారు. ఆమె పేరేంటి ?
జ: నైర్ ఇనాయత్ ఖాన్
18) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో రజితం గెలుచుకొని రికార్డు సృష్టించిన భారతీయ రెజ్లర్ ఎవరు ?
జ: బజరంగ్ పూనియా
19) చైనాలో జరిగిన షాంఘై ఓపెన్ చెస్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచిన తెలుగు కుర్రాడు, గ్రాండ్ మాస్టర్ ఎవరు ?
జ: ముసునూరి లలిత్ బాబు
20) భారత్ క్రికెట్లో మొదటిసారిగా మహిళా ఎంపైర్స్ గా బాధ్యతలు చేపడుతున్నది ఎవరు ?
జ: వృందా రాఠి ( ముంబై), జనని (చెన్నై)
21) దేవధర్ ట్రోఫీ (క్రికెట్) ఎక్కడ జరుగుతోంది ?
జ: ఢిల్లీ

అంతర్జాతీయం
22) రష్యాతో కుదుర్చుకున్న ఏ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా ప్రకటించింది ?
జ: మధ్యంతర క్షిపణి అణ్వస్త్ర బలగాల ఒడంబడిక ( INF)
23) 1987లో INF ఒప్పందంపై సంతకం చేసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ఎవరు ?
జ: అమెరికా అధ్యక్షుతు రోనాల్డ్ రీగన్, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు
మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం
https://telanganaexams.com/mocktests/