Tuesday, November 13
Log In

CURRENT AFFAIRS – OCT 21

రాష్ట్రీయం
01) కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ గ్లోబల్ ఛాలెంజెస్ పై నిర్వహించిన హ్యాకథాన్ ను ఎక్కడ ప్రారంభించారు ?
జ: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో

జాతీయం
02) ప్రధాని నరేంద్రమోడీతో ఢిల్లీలో సమావేశమైన శ్రీలంక ప్రధాని ఎవరు ?
జ: రణిల్ విక్రమ సింఘే
03) తగినంత వర్షాలు పడకపోవడంతో దేశంలోని ఎన్ని జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు భారత వాతారణ విభాగం ప్రకటించింది ?
జ: 200 జిల్లాలు
04) 19.3కిలో మీటర్లతో మన దేశంలోనే అతి పొడవైన వంతెనను ఏ నదిపై నిర్మించనున్నారు ?
జ: బ్రహ్మపుత్ర నదిపై
(నోట్: అసోం, మేఘాలయ మధ్య ప్రయాణ దూరం, కాలం తగ్గించడానికి ఈ బ్రిడ్జి నిర్మిస్తారు )
05) బెంగళూరులో జరిగిన విజయ్ హజారే వన్డే క్రికెట్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది ?
జ: ముంబై ( ఫైనల్లో ఢిల్లీని ఓడించింది )
06) దేశంలోనే మొదటిసారిగా తొలి క్రిప్టో కరెన్సీని ఏటీఎం కియాస్క్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: బెంగళూరులోని రాజాజీ నగర్ లో

అంతర్జాతీయం
07) హాంకాంగ్ - మకావులను కలుపుతూ దక్షిణ చైనా సముద్రంపై చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన ఈనెల 24నుంచి అందుబాటులోకి రానుంది ? ఈ వంతెన పొడవు ఎంత ?
జ: 55 కిమీ
08) ప్రపంచంలోనే అతి పెద్ద ఉభయచర విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో చైనా రూపొందించింది. దీని పేరేంటి ?
జ: AG600

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు
మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం
https://telanganaexams.com/mocktests/