Monday, December 17

CURRENT AFFAIRS -OCT 18

జాతీయం
01) ప్రపంచ ఆర్థిక వేదిక ( WEF) ప్రకటించిన ప్రపంచ పోటీ తత్వ సూచీ -2018లో భారత్ స్థానం ఎంత ?
జ: 58 వ స్థానం ( 5స్థానాలు ఎగబాకింది )
02) దేశంలోనే మొదటిసారిగా భూగర్భంలో రైల్వే స్టేషన్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: కీలాంగ్ రైల్వే స్టేషన్ ( హిమాచల్ ప్రదేశ్ )
03) మీ టూ ఆరోపణలతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు ?
జ: ఎం.జె. అక్బర్
04) అసోచామ్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: బాలకృష్ణన్ గోయెంకా (వెల్ స్పన్ గ్రూప్ ఛైర్మన్)

అంతర్జాతీయం
05) ప్రపంచ ఆర్థిక వేదిక ( WEF) ప్రకటించిన ప్రపంచ పోటీ తత్వ సూచీ -2018లో అగ్రస్థానానికి చేరుకున్న దేశం ఏది ?
జ: అమెరికా
(నోట్: రెండు, మూడు స్థానాల్లో సింగపూర్, జర్మనీ నిలిచాయి )
06) మన్ బుకర్ బహుమతిని ఈ ఏడాదికి ఎవరు గెలుచుకున్నారు ?
జ: అన్నా బర్న్స్ ( నవల: మిల్క్ మ్యాన్, ఉత్తర ఐర్లాండ్ రచయిత్రి )
07) భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనా ఏ సూపర్ సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది ?
జ: HD-1
(నోట్: గ్యాంగ్ డాంగ్ ప్రొవిన్స్ లోని గ్యాంగ్ ఝౌలో హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ దీన్ని రూపొందిస్తోంది. )
08) 15 టన్నుల వస్తువులను రవాణా చేయగలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా డ్రోన్ ను చైనా పరీక్షించింది. దాని పేరేంటి ?
జ: పైహాంగ్ -98 (FH-98)

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు
మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం
https://telanganaexams.com/mocktests/