Monday, November 12
Log In

CURRENT AFFAIRS – OCT 15

రాష్ట్రీయం
01) ఈ ఏడాది సుద్ధాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారాన్నిఎవరికి ఇచ్చారు ?
జ: గాయకుడు జయరాజ్
02) రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో ఒక మొక్కల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఎన్ని పంచాయతీల్లో నర్సరీ ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు ?
జ: 8,789

జాతీయం
03) గాలిలో కాలుష్యాన్ని బట్టిని కఠిన చర్యలు తీసుకునే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ( గ్రాప్ ) ఎక్కడ అమలు చేయబోతున్నారు ?
జ: న్యూ ఢిల్లీలో
04) దేశంలోనే మొదటిసారిగా జాతీయ పోలీస్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటవుతోంది.
జ: ఢిల్లీలో
(నోట్: 2018 అక్టోబర్ 21న ప్రధాని నరేంద్రమోడీ దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇది చాణక్యపురి ప్రాంతంలో ఉంది )
05) మహిళలపై జరిగే నేరాలు, దొంగతనాలు, వేధింపుల నమోదుకు రైల్వే శాఖ కొత్త యాప్ సిద్ధం చేసింది. వీటి ద్వారా వచ్చే ఫిర్యాదులను ఏ FIR లుగా పరిగణిస్తారు ?
జ: జీరో FIRలు
06) రైల్వే అందించే సేవల వివరాలను పొందడంలో ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించేందుకు ఏ పేరుతో చాట్ బోర్డును రైల్వే శాఖ అమల్లోకి తెస్తోంది ?
జ: ఆస్క్ దిశా
07) పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయుల కోసం రాష్ట్రానికి కనీసం రెండు చొప్పున ఆదర్శ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏ పథకం కింద అమలు చేస్తున్నారు ?
జ: దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం (డే - NULM)
08) లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మీటూ ఉద్యమంలో భాగంగా ప్రత్యేక ఈ మెయిల్ ను ఢిల్లీ మహిళా సంఘం ప్రారంభించింది. అది ఏది ?
జ: meetoodcw@gmail.com ( Toll free no. 181)

09) హైదరాబాద్ లో వెస్టీండిస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. సొంతగడ్డపై భారత్ వరుసగా ఎన్నో సిరీస్ గెలిచింది ?
జ: 10 సిరీస్ లు

అంతర్జాతీయం
10) భారత్ లో విజయవంతమైన ఆధార్ వ్యవస్థను తమ దగ్గర కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన దేశం ఏది ?
జ: మలేసియా
11) అంతరిక్షంలోని గురుత్వాకర్షణ తరంగాలను అన్వేషించేందుకు మొదటిసారిగా 3 ఉపగ్రహాలను ప్రయోగించనున్న దేశం ఏది ?
జ: చైనా
12) సెకనుకు 10 లక్షల కోట్ల ఫ్రేములను బందించే కొత్త కెమెరాని ( టీ-కంప్రెస్డ్ ఆల్ట్రాఫాస్ట్ ఫోటోగ్రఫీ ( T-CUP)ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
జ: అమెరికా ( కాలిఫోర్నియాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ )

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు
మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం
https://telanganaexams.com/mocktests/