Friday, September 20

CURRENT AFFAIRS – OCT 13

రాష్ట్రీయం
01) తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ?
జ: 2,73,28,054 మంది
(నోట్: పురుషులు : 1,37,87,920, మహిళలు: 1,35,28,020, థర్డ్ జండర్ : 2,663 మంది )
02) రాష్ట్రంలో కొత్త ఓటర్లుగా ఎంతమంది నమోదయ్యారు ?
జ: 11.81 లక్షల మంది
03) తెలంగాణ రాష్ట్ర సైన్స్ కాంగ్రెస్ మొదటి సమావేశం 2018 డిసెంబర్ 22 నుంచి 3 రోజుల పాటు ఎక్కడ జరగనుంది ?
జ: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (NIT) లో
04) తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు ఎవరు ?
జ: ప్రొ. కె.నరసింహారెడ్డి
05) రాష్ట్రంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన వీహబ్ లో పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అమెరికా సంస్థ ఏది ?
జ: సేల్స్ ఫోర్స్
06) అంతర్జాతీయ యానిమేషన్, గేమింగ్, ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పో ను డిసెంబర్ 1 నుంచి 6 దాకా HICC లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన పేరేంటి ?
జ: ఇండియా జాయ్

జాతీయం
07) జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాపించి 25యేళ్ళయిన సందర్భంగా రజితోత్సవ కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
జ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో
08) ప్రపంచంలోనే అత్యున్నత మానవ హక్కుల సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థకు భారత్ ఎన్నికైంది. ఈ సభ్యత్వం ఎప్పటి దాకా అమల్లో ఉంటుంది ?
జ: 1 జనవరి 2019 వరకూ
09) ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును కొలీజియం సిఫార్సు చేసింది ?
జ: జస్టిస్ రమేష్ రంగనాథన్
10) క్రిమినల్ కేసుల్లో బాధితులకూ పై కోర్టులో సవాల్ చేసే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన సెక్షన్ ఏది ?
జ: CRPC లోని 372 సెక్షన్
11) ప్రపంచంలో అత్యధిక టైమ్ జోన్స్ ఉన్న మూడు దేశాలు ఏవి;
జ: ఫ్రాన్స్ (12), అమెరికా, రష్యా (11)
( టైమ్ జోన్స్ పై వివరాలను జనరల్ నాలెడ్స్ లో ఇచ్చాం )

అంతర్జాతీయం
12) గంటకి వెయ్యి కిలోమీటర్లతో పరుగులు తీసే కొత్త హైస్పీడ్ రైలు నమూనాని ప్రదర్శించిన దేశం ఏది ?
జ: చైనా ( 2025 నాటికి అందుబాటులోకి రానుంది. ప్రాజెక్ట్ పేరు: టీ ఫ్లయిట్ )
13) నోబెల్ సాహిత్య అవార్డుకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ది న్యూ అకాడమీ సాహిత్య అవార్డు ఎవరికి దక్కింది ?
జ: మరీసే కాండే ( ఫ్రాన్స్ లోని గ్వాడెలోప్ కు చెందిన ఈమె వలసవాదంపై రచనలు చేశారు )