Tuesday, April 23

CURRENT AFFAIRS – OCT 12

రాష్ట్రీయం
01) ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి 44యేళ్ళ కవిత్వ జీవన ప్రస్థానం- సాహితీ సమాలోచన - జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
జ: హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో
02) హైదరాబాద్ లో చనిపోయిన డాక్టర్ పాటిబండ్ల చంద్రశేఖర్ రావు ఏ రంగంలో నిపుణులు ?
జ: న్యాయ కోవిదుడు (అంతర్జాతీయ సముద్ర జల చట్టాల ట్రైబ్యునల్ మాజీ న్యాయమూర్తి )
03) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని వెనుకబడిన కులాలను సంచార జాతుల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు ?
జ: 25 కులాలు
04) కొత్తగూడెంలో టీఎస్ జెన్ కో నిర్మించిన ఏడో దశ థర్మల్ విద్యుత్కేంద్రం ఈ నెలాఖరు నుంచి విద్యుత్పత్తి మొదలవుతుంది. ఇది ఎన్ని మెగావాట్లు ?
జ: 800 మెగావాట్లు
05) స్వైన్ ఫ్లూ కారక H1N1 వైరస్ ను నిర్ధారించడానికి రూ.20లక్షలతో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన అత్యాధునిక పరికరం ఏది ?
జ: రివర్స్ ట్రాన్ స్క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ (RT-PCR)
(నోట్: దీన్ని నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్ లో ఏర్పాటు చేశారు )
06) 2019 జూన్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొంటారు ?
జ: 83 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు

జాతీయం
07) నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా భారత్ ను ఎంపిక చేసిన సంస్థ ఏది ?
జ: ప్రపంచ ఆర్థిక వేదిక
08) కాలుష్యరహిత గంగానది కోసం 109 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఉత్తరాఖండ్ లో కన్నుమూసిన ప్రముఖ పర్యావరణ వేత్త ఎవరు ?
జ: జీడీ అగర్వాల్
09) గ్రామాల్లో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులను అడ్డుకునేందుకు పోలీసులు, బాధితుల మధ్య వారధిగా పనిచేసే కొత్త వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. వాళ్ళని ఏమంటారు ?
జ: మహిళా పోలీస్ వాలంటీర్లు
10) చైనా బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ రచనా కేంద్రంలో అంతర్జాతీయ సాహిత్యంపై నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న ప్రముఖ కవి ఎవరు ?
జ: డాక్టర్ ఎన్. గోపి
11) మన దేశాన్ని ఏయే సంస్థలు పోలియో రహిత దేశంగా ప్రకటించాయి ?
జ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్
12) 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ?
జ: నందకిశోర్ సింగ్
13) జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులను మట్టుపెట్టినందుకు ఎవరికి శౌర్య చక్ర అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది ?
జ: మన్జూర్ అహ్మద్ నాయక్
14) పారా ఆసియా క్రీడల హైజంప్ లో స్వర్ణం దక్కించుకున్న భారతీయ అథ్లెట్ ఎవరు ?
జ: శరద్ కుమార్

అంతర్జాతీయం
15) తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణ శిక్షను రద్దుచేసిన దేశం ఏది ?
జ: మలేసియా