Wednesday, September 18

CURRENT AFFAIRS – OCT 1

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేసేందుకు సీఎస్ ఎస్కే జోషి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవస్థను ఏ పేరుతో 2018 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది ?
జ: ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ) ఆర్డర్ 2018
02) రాష్ట్రంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ ఎంతమంది ఎస్సీ, ఎస్టీల లబ్దిదారులకు చేరింది ?
జ: 29.8శాతం

జాతీయం
03) మహాత్మా గాంధీ ఈసీజీ ఆధారంగా ఆయన గుండె చప్పుడును సృష్టించి డిజిటలైజేషన్ చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేసిన జాతీయ గాంధీ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉంటుంది ?
జ: ఢిల్లీ
04) సరిహద్దు భద్రతా దళం (BSF) కొ్త డైరెక్టర్ జనరల్ (DJ) గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రజనీకాంత్ మిశ్రా ( 1984 బ్యాచ్ యూపీ కేడర్ సీనియర్ IPS అధికారి )
05) సశస్త్ర సీమా బల్ ( SSB) కు కొత్త DJ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: SS దేశ్ వాల్ ( హరియాణా కేడర్ కు చెందిన IPS అధికారి )
06) గుజరాత్ లోని ముంద్ర ఓడరేవులోని మూడో LNG టెర్మినల్, మరో 2 గ్యాస్ ప్రాజెక్టులకు (ప్రాజెక్ట్ విలువ రూ.6216 కోట్లు) ఎవరు జాతికి అంకితం చేశారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
07) భారత్ లో సునామీ హెచ్చరికలను చేసే భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం ( ఇన్ కాయిస్ ) ఎక్కడ ఉంది ?
జ: హైదరాబాద్ లో
08) GST ఎగవేతదార్లపై సమాచారం ఇస్తే బహుమతి ఇచ్చేందుకు ఏ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావాలని కేంద్ర రెవెన్యూ శాఖ భావిస్తోంది ?
జ: GST ఇన్ ఫర్మెంట్ రివార్డ్ స్కీమ్
09) డెబిట్ కార్డులతో నగదు విత్ డ్రా కి అక్టోబర్ 31 నుంచి SBI ఎంత పరిమితిని విధించనుంది ?
జ: రూ.20 వేలు ( ప్రస్తుతం రూ.40వేలు ఉండేది)
10) దేశంలో మరుగుదొడ్లు కలిగిన గృహాల సంఖ్య గతంలో 38.70శాతంగా ఉండేది. ఇప్పుడు ఎంతకు పెరిగింది ?
జ: 96.94 శాతం
11) ఏ రాష్ట్ర కేబినెట్ లో త్వరలో ఆవుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నారు ?
జ: మధ్యప్రదేశ్ లో
12) టర్కీ లోని సంసున్ లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో కాంస్యం గెలుచుకున్న భారతీయ ఆర్చర్ ఎవరు ?
జ: దీపిక కుమారి
13) కొత్తగా టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ( టాప్స్ ) లో చేరిన క్రీడ జట్టు ఏది ?
జ: భారత మహిళల హాకీ జట్టు ( 18మంది సభ్యులకు అవకాశం )

అంతర్జాతీయం
14) పదవి నుంచి రిలైర్డ్ అవుతున్న పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) అధిపతి ఎవరు ?
జ: లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5 గ్రాండ్ టెస్టులు (TM) సెకండ్ పేపర్ పై ప్రత్యేక శ్రద్ధ

పూర్తి వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి :

https://telanganaexams.com/gp-secy-mock/