Tuesday, July 23

CURRENT AFFAIRS – NOV3

తెలంగాణ
01) దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగంలో తెలంగాణకు ఎన్నో స్థానం దక్కింది ?
జ: మొదటి స్థానం (కేంద్ర విద్యుత్ మండలి 2016-17 రిపోర్ట్ )
02) రాష్ట్రంలో విద్యుత్ తలసరి వాడకం ఎంతగా ఉంది ?
జ: 11.34శాతం
03) రాష్ట్రంలో విద్యుత్ తలసరి వృద్ధి ఎంత శాతంగా ఉంది ?
జ: 13.62 శాతం
04) ఇంటర్నెట్ లో తెలుగు వర్డ్ నెట్ ద్వారా 21వేల తెలుగు పదాలకు చోటు కల్పించిన హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఎవరు ?
జ: శ్రీ కవిత పారుపల్లి ( ఖమ్మం జిల్లా)
05) తక్కువ సమయంలో డేటాని అర్థం చేసుకోవడంతో పాటు క్షణాల్లో కోరుకున్న భాషలో ట్రాన్సులేట్ చేయగల అప్లికేషన్ ను రూపొందించి శాంసంగ్ ఇన్నోవేషన్ అవార్డ్-2018ని అందుకున్న IIT హైదరాబాద్ విద్యార్థి ఎవరు ?
జ: కన్నన్ చంద్రశేఖర్

జాతీయం
06) సూక్ష్మ, మధ్యతరహా (MSME) సంస్థల నిర్వాహకులకు 59 నిమిషాల్లో ఎంత రుణం అందించేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు ?
జ: రూ.1 కోటి వరకూ
07) చిన్న సంస్థలకు గంటలో కోటి రుణం ఇచ్చే పోర్టల్ పేరేంటి ?
జ: www.psbloanin59minutes.com
08) 2008-14 మధ్య రుణాలను అదుపుచేయడంలో RBI విఫలం అయినందున ఆ బ్యాంకు వ్యవహారాల్లో ఏ సెక్షన్ కింద జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: సెక్షన్ 7
09) కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎవరు ?
జ: సుభాశ్ చంద్ర గార్గ్
10) ప్రపంచ ఆహార దినోత్సవం సందర్బంగా సురక్షితమైన ఆహారం గురించి అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమం పేరేంటి ?
జ: స్వాస్థ్ భారత్ యాత్ర
11) దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ‘‘ది కలామ్ విజన్ - డేర్ టు డ్రీం - పేరుతో తన వెబ్ సైట్ ను అంకితమిచ్చిన సంస్థ ఏది ?
జ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO)
12) వ్యవసాయంలో మహిళల పాత్రను పెంచేందుకు రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: అక్టోబర్ 15
13) హైదరాబాదీ క్రికెట్ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథతో వస్తున్న పుస్తకం ఏది ?
జ: 281 అండ్ బియాండ్
14) ప్రొ వాలీబాల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన బ్యాడ్మింటన్ స్టార్ ఎవరు ?
జ: పి.వి. సింధు
15) కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ రెజ్లర్ ఎవరు ?
జ: యోగేశ్వర్ దత్

అంతర్జాతీయం
16) క్రికెట్ లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన మంకీగేట్ ఉదంతం ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ తో ముడిపడి ఉంది ?
జ: మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్
(నోట్: 2008లో సిడ్నీలో - భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా హర్భజన్ సింగ్ తనను కోతి అన్నాడని సైమండ్స్ ఆరోపించాడు )

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/