Monday, November 12
Log In

CURRENT AFFAIRS – NOV 7 & 8

తెలంగాణ
01) ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి చనిపోయారు. ఆయన రచనలు ఏవి ?
జ: భాగవత కథా తత్వం, సాలగ్రామ శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, మాంగళ్య శాస్త్రం, స్వర్ణ శకలాలు
02) తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కపిలవాయి లింగమూర్తికి ఎప్పుడు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఏ తేదీన అందుకున్నారు ?
జ: 2014 ఆగస్టు 30న

జాతీయం
03) అయోధ్యలో 3 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఏ నది ఒడ్డున వీటిని వెలిగించారు?
జ: సరయూ నది తీరంలో ( మొత్తం 3,01,152 దీపాలు వెలిగించారు )
04) ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాను ఏ విధంగా పేరు మార్చనున్నట్టు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు ?
జ: అయోధ్య
05) ఆయుర్వేదానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నేషనల్ సెమినార్ నవంబర్ 4 న ఎక్కడ జరిగింది ?
జ: న్యూ ఢిల్లీ
06) రుణగ్రస్థుల వివరాల సేకరణ కోసం PCR ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. PCR అంటే ఏంటి ?
జ: Public Credit Registry
07) ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత యువ షూటర్ ఎవరు ?
జ: అంగద్ వీర్ సింగ్ బజ్వా

అంతర్జాతీయం
08) శత్రువుల రాడార్లకి దొరక్కుండా కొత్త తరం మానవరహిత యుద్ధ విమానాన్ని చైనా తయారు చేసింది. డ్రోన్స్ లో ఇదే అధునాతనమైనది. దాని పేరేంటి ?
జ: CH 7
09) కాలుష్యం, అనారోగ్య పరిస్థితులపై WHO నిర్వహిస్తున్న గ్లోబల్ కాన్ఫరెన్స్ 2018 అక్టోబర్ 30న ఎక్కడ జరిగింది?
జ: జెనీవా
10) లిటిల్ ఇండియా గేట్ - అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఏ సిటీలో ప్రారంభించారు ?
జ: మెడాన్ (ఇండోనేషియా)
11) ప్రపంచ సునామీ దినోత్సవాన్ని ప్రతి యేటా ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: నవంబర్ 5

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/