Monday, November 12
Log In

CURRENT AFFAIRS – NOV 6

తెలంగాణ
01) తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ స్నూకర్, బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో విజేతగా ఎవరు నిలిచారు ?
జ: హిమాంశు

జాతీయం
02) భారతీయ అణు జలంతర్గామి తొలివిడత గస్తీని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ జలంతర్గామి పేరేంటి ?
జ: INS అరిహంత్
03) యోగా గురు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ బ్రాండెడ్ దుస్తుల విభాగంలోకి ప్రవేశించింది. ఏ బ్రాండ్ పేరుతో బట్టలను విక్రయించనున్నారు ?
జ: పరిధన్
04) బుల్లి 3డీ ఇల్లును త్వష్ణ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ పేరుతో రూపొందించిన IIT ఏది ?
జ: IIT మద్రాస్
05) పాత్రికేయ రంగంలో విశేష కృషి చేసిన హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్ రామ్ కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ అవార్డును ప్రకటించింది ?
జ: రామ్ మోహన్ రాయ్ అవార్డు
06) ప్రతి యేటా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా PCI రామ్ మోహన్ రాయ్ అవార్డులు ప్రదానం చేస్తుంది. అయితే జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: నవంబర్ 16న
07) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఇతర అవార్డులు
గ్రామీణ పాత్రికేయ విభాగంలో ‘‘ఎక్స్‌లెన్స్‌ - రుబీ సర్కార్ (దేశ్ బంధు పత్రిక), రాజేశ్ పరుశురామ్ ( ఫుధారి పత్రిక)

అంతర్జాతీయం
08) మాజీ క్రికెట్ దిగ్గజాలతో కలసి టీ10 లీగ్ నవంబర్ 21 నుంచి ఎక్కడ జరగనుంది ?
జ: దుబాయ్ లో
09) ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోడానికి 8 దేశాలకు ఆంక్షల నుంచి అమెరికా మినహాయింపు ఇచ్చింది. అందులో భారత్ తో పాటు ఉన్న దేశాలు ఏవి ?
జ: జపాన్, ఇటలీ, గ్రీస్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీ

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/