Tuesday, July 23

CURRENT AFFAIRS – NOV 5

తెలంగాణ
01) తెలంగాణలో ఎన్ని గ్రామాలను మల, మూత్ర విసర్జన రహితంగా (ODF) జాతీయ వార్షిక గ్రామీణ పారిశుధ్య సర్వే గుర్తించింది ?
జ: 4,728 గ్రామాలు
02) రాష్ట్రంలో ఎన్ని గ్రామాలను కలెక్టర్లు ODF గా గుర్తించారు ?
జ: 6,842 గ్రామాలు
03) రాష్ట్రంలో జనం తినే ఆహారపదార్థాల్లో 51శాతం పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించిన సంస్థ ఏది ?
జ: ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ అండ్ హెల్త్ ఇన్ ఇండియా
04) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ అండ్ హెల్త్ ఇన్ ఇండియా సంస్థ తయారు చేసిన నివేదిక పేరేంటి ?
జ: ఏ రోడ్ మ్యాప్ టూ ఇండియాస్ హెల్త్
05) కొత్తగూడెంలో మరణించిన జాతశ్రీ ఏ రంగానికి చెందినవారు ?
జ: ప్రముఖ నవలా, కథారచయిత

జాతీయం
06) ఇంట్లోని నిరక్షరాస్యులపై పెద్దలకు చదువు చెప్పేందుకు పిల్లలే గురువులుగా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రారంభించబోయే పథకం పేరేంటి ?
జ: పఢనా - లిఖ్‌నా
07) ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడత మూలధన సాయం కింద ఎంత మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది ?
జ: రూ.54 వేల కోట్లు
08) ఈఫిల్ టవర్ తరహాలో ఢిల్లీలో యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించారు. వేలాడే కేబుళ్ళతో మొత్తం ఎన్ని మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు ?
జ: 575 మీటర్లు
(నోట్: భారత్ లోనే మొదటి అసిమెట్రికల్ కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది )
09) 2018 లో అత్యంత పోటీతత్వ ఆర్థి్క వ్యవస్థపై 140 దేశాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక సూచీలో భారత్ కు ఎన్నో ర్యాంక్ లభించింది ?
జ: 58వ ర్యాంక్
10) అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఎన్నికైన భారతీయుడు ఎవరు ?
జ: సౌరభ్ నేత్ర వల్కర్
11) భారత్ - వెస్టిండీస్ మధ్య కోల్‌క‌తాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ కు గంట మోగించి ఆట ప్రారంభించింది ఎవరు ?
జ: భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్
12) రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా ఎవరు నియమితులవుతున్నారు ?
జ: భారత మాజీ ఫేసర్ జహీర్ ఖాన్
13) ఇండోనేషియాలోని జకర్తాలో ఇటీవల ముగిసిన 2018 ఆసియా పారా క్రీడల్లో భారత్ కు ఎన్ని పతకాలు వచ్చాయి ?
జ: 72 పతకాలు

అంతర్జాతీయం
14) అమెరికా ప్రతినిధుల సభల్లో ఎన్ని స్థానాలకు ఈనెల 6న మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి ?
జ: మొత్తం 435 స్థానాలు
సెనేట్ లో: 35 స్థానాలు (మొత్తం 100 సీట్లు)
15)ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత అణగారిన దేశం ఏది ?
జ: భారత్
16) మిల్క్ మెన్ నవలకు 50వ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి ఉత్తర ఐరిష్ రైటర్ ఎవరు ?
జ: అన్నా బర్న్స్
17) గంజాయి కలిగి ఉండటం, పీల్చడాన్ని చట్టబద్దం చేసిన దేశం ఏది ?
జ: కెనడా (మొదట ఉరుగ్వే చేసింది )
18) చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై 8వ యూరప్ సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: కోటావీస్, పోలెండ్

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/