Tuesday, November 13
Log In

CURRENT AFFAIRS – NOV 4

తెలంగాణ
01) కార్తీక మాసం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 20 నుంచి 23 వరకూ మనగుడి కార్యక్రమాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది ?
జ: తిరుమల తిరుపతి దేవస్థానం
02) వరి పంట సాగులో సస్యరక్షణ, యాజమాన్య పద్దతులపై మొబైల్ యాప్ ను ఎవరు రూపొందించారు ?
జ: భారత వరి పరిశోధనా సంస్థ
(నోట్: ఈ యాప్ ను ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు ఆవిష్కరించారు )
03) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలు ప్రమాదాలకు కారణమైన కాపలా లేని రైల్వే క్రాసింగ్ లను సురక్షితంగా మార్చిన దక్షిణ మధ్య రైల్వే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే మొత్తం ఎన్ని లెవల్ క్రాసింగ్ లకు కాపలా ఏర్పాట్లు చేశారు ?
జ: 468
04) దేశంలో ఎక్కడి నుంచైనా యాప్ ద్వారా జనరల్ రైల్వే టికెట్ కొనుగోలు చేసేలా యాప్ అమల్లోకి వచ్చింది. దాని పేరేంటి ?
జ: యూటీఎస్
(నోట్: దక్షిణ మధ్య రైల్వే ఈ యాప్ 2016లోనే తీసుకొచ్చింది. 2018 నవంబర్ 1 నుంచి దీన్ని దేశమంతటికీ విస్తరించారు )

జాతీయం
05) భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: ఎమర్సన్ నన్ గాగ్వా
06) జింబాబ్వేలో విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భారత్ సాయం చేయనుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం ఎంత ?
జ: రూ.2,260 కోట్లు ( మొత్తం 6 ఒప్పందాలపై రెండు దేశాలమధ్య సంతకాలు జరిగాయి)
07) దేశంలో 7వ ఆర్థిక గణనను ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2019 జనవరిలో
08) దేశంలో 6వ ఆర్థిక గణన ఏ సంవత్సరంలో జరిగింది ?
జ: 2013-14లో
09) టీమ్ ఇండియాలో నిలకడగా రాణిస్తున్న అంబటి రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఏ క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ?
జ: హైదరాబాద్ జట్టుకి
10) ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించారు. దీన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు ?
జ: యమునా నదిపై (154 మీటర్ల ఎత్తులో )
11) మహారాష్ట్రలో 26 గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తూ 14 మందిని చంపేసిన పులిని హైదరాబాదీ షూటర్ షఫత్ అలీఖాన్ చంపేశాడు. దీని పేరేంటి ?;
జ: అవని (టీ1)

అంతర్జాతీయం
12) పాకిస్తాన్ తో 16 రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న దేశం ఏది ?
జ: చైనా
(నోట్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా చైనాకి వెళ్లి ప్రధాని కెకియాంగ్ తో సమావేశం అయ్యారు )

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/