Monday, December 17

CURRENT AFFAIRS – NOV 30

తెలంగాణ
01) ఓటరుకి పోలింగ్ బూత్, అధికారుల వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆవిష్కరించిన కొత్త యాప్ ఏది ?
జ: నా వోట్
02) రాష్ట్రంలోని నదుల్లో కాలుష్యం తగ్గించి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. దీనికి ఎవరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు ?
జ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
03) తిరువనంతపురంలో జరుగుతున్న జాతీయ షూటింగ్ చాంపియన్షిప్ లో 7 పతకాలు గెలుచుకున్న తెలంగాణ ప్లేయర్ ఎవరు ?
జ: ఇషా సింగ్
(నోట్: 4 స్వర్ణాలు, 3 రజితాలు, 1 కాంస్యం మొత్తం ఏడు పతకాలు గెలుచుకుంది )

జాతీయం
04) PSLV-C43 ద్వారా ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ?
జ: 31 ఉపగ్రహాలు
05) ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ లో మన దేశానికి చెందిన ఉపగ్రహం ఏది ?
జ: హైసిస్ ( హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ )
06) PSLV-C43 ద్వారా ఎన్ని దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?
జ: 8 దేశాలు
07) భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి రిటైర్డ్ అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: జస్టిస్ కురియన్ జోసెఫ్
08) విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు ఎంతశాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది ?
జ: 16శాతం
09) మరాఠాలకు 16శాతం రిజర్వేషన్ పెంపుతో మహారాష్ట్రలో మొత్తం కోటా ఎంత శాతానికి చేరింది ?
జ: 68 శాతం
10) చిన్నారుల కోసం మికో 2 పేరుతో తొలి రోబోని తయారు చేసిన IIT విద్యార్థులు ఎవరు ?
జ: IIT బాంబే విద్యార్థులు
11) ఎయిరిండియాకు రూ.29వేల కోట్ల రుణమాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ సంస్థకు ఎంత రుణం ఉంది ?
జ: రూ.50వేల కోట్లు

అంతర్జాతీయం
12) అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్ లో అండర్ 30 శాస్త్రవేత్తల విభాగంలో చోటు దక్కించుకున్న తెలుగు అమ్మాయి ఎవరు ?
జ: బొల్లింపల్లి మేఘన
(నోట్: 2018మేల నిర్వహించిన ఐసెఫ్ ( ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ ) ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు ఈ అమ్మాయి పేరును చేర్చారు )
13) పాకిస్తాన్ లో ఉన్న బాలీవుడ్ దిగ్గజాలు పృధ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ ల పూర్వీకుల పురాతన నివాసం (హవేలీ)ని ప్రదర్శనశాలగా మార్చనున్నారు. ఇది పాక్ లో ఎక్కడ ఉంది ?
జ: పెషావర్ లో

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ