Monday, December 17

CURRENT AFFAIRS – NOV 29

జాతీయం
01) జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశ పర్యటకు వెళ్ళారు ?
జ: అర్జెంటీనా ( బ్యూనస్ ఎయిర్స్ లో )
02) UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: అరవింద్ సక్సేనా
03) కొత్తగా UPSC ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన అరవింద్ సక్సేనా ఎప్పటి దాకా ఆ పదవిలో కొనసాగుతారు ?
జ: 2020 ఆగస్టు 20
04) UPSC ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు ?
జ: రాష్ట్రపతి
05) మరణశిక్ష రాజ్యాంగ బద్దమేనని ఏ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ?
జ: ఛన్నూలాల్ వర్మ కేసులో (2011లో ఇద్దరు మహిళలు సహా ముగ్గుర్ని హత్య చేశాడు )
06) అన్ని అత్యవసర సేవల కోసం 112 అనే నెంబర్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: హిమాచల్ ప్రదేశ్
07) FICA ఎమర్జింగ్ ఆర్టిస్ట్ అవార్డు 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
జ: అనుపమ్ రాయ్ (ఢిల్లీ )
08) జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతియేటా ఏ రోజున నిర్వహిస్తారు ?
జ: నవంబర్ 26న (రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నాడే )

అంతర్జాతీయం
09) సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్ పూర్ కారిడార్ కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శంకుస్థాపన చేశారు. అయితే ఇక్కడి గురుద్వారాను ఏ సిక్కుమత గురువు నిర్మించారు ?
జ: సిక్కుమత స్థాపకుడు గురు నానక్ దేవ్ నిర్మించారు.
10) ఈసారి దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: ఇస్లామాబాద్ లో
11) జన్యు ఎడిటింగ్ పై విమర్శలు రావడంతో తన ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన చైనా శాస్త్రవేత్త ఎవరు ?
జ: హె జియాంక్యే
12) వరుసగా నాలుగోసారి ప్రపంచ చెస్ ఛాంపియన్ గా ఎవరు నిలిచారు ?
జ: మాగ్నస్ కార్ల్ సన్ ( నార్వే సూపర్ గ్రాండ్ మాస్టర్ )
13) 2019 వన్డే ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంట్ ఏ దేశంలో జరుగుతోంది ?
జ: ఇంగ్లండ్
14) 2019 వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరుగుతాయి ?
జ: 2019 మే 30 నుంచి జులై 14 వరకూ (మొత్తం 48 మ్యాచ్ లు )
15) డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ 2018 ను గెలుచుకున్న టీమ్ ఏ దేశానికి చెందినది ?
జ: క్రొయేషియా

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ