Monday, December 17

CURRENT AFFAIRS – NOV 28

తెలంగాణ
01) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం దగ్గర నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. గతంలో ఏయే ప్రాజెక్టుల పునరాకృతిలో భాగంగా వీటిని నిర్మిస్తున్నారు ?
జ: రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్
02) హైదరాబాద్ లో వచ్చే ఏడాది (2019) జూన్ నిర్వహించే అంతర్జాతీయ విత్తన సదస్సులో ఎన్ని దేశాలకు చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు ?
జ: 80దేశాలు
03) అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం ( ఇస్టా) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: జ్యూరిచ్ ( స్విట్జర్లాండ్ )

జాతీయం
04) 2024 నాటికి దేశంలో 20-30 శాతం కాలుష్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఎన్ని నగరాల్లో కార్యచరణ మొదలుపెట్టనుంది ?
జ: హైదరాబాద్ సహా 102 నగరాల్లో
05) 2024 నాటికి దేశంలో కాలుష్యాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: జాతీయ పరిశుద్ధ గాలి కార్యక్రమం ( NCAP)
06) డిసెంబర్ 2 నుంచి పోలండ్ లో జరిగే ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఎవరు పాల్గొంటున్నారు ?
జ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్
07) మై నేమ్ ఈజ్ లఖన్ పాటతో అందరికీ పరిచయమైన ప్రముఖ గాయకుడు ముంబైలో చనిపోయారు. ఆయన ఎవరు ?
జ: మొహమ్మద్ అజీజ్
08) హాకీ ప్రపంచ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఏయే జట్ల మధ్య జరుగుతోంది ?
జ: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
09) భారత్ లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతోంది ?
జ: భువనేశ్వర్ లోని కళింగ స్టేడింయం

అంతర్జాతీయం
10) అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) పంపిన సరికొత్త ల్యాండర్ వ్యోమనౌక విజయవంతంగా అంగారకుడిపై అడుగుపెట్టింది. దాని పేరేంటి ?
జ: ఇన్ సైట్
11) అంగారకుడిపై కాలుమోపిన ఇన్ సైట్ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు ?
జ: 2018 మే 5న కాలిఫోర్నియా నుంచి
12) ఎప్పటి లోగా అంగారకుడిపై మానవసహిత యాత్ర చేపట్టాలని నాసా భావిస్తోంది ?
జ: 2030 వరకూ

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

SI MAINS కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియో చూడండి:

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ