Wednesday, September 18

CURRENT AFFAIRS – NOV 27

తెలంగాణ
01) ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఫర్ సార్క్ కంట్రీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ఎమ్మెల్సీ ఎవరు ?
జ: కె.జనార్ధన్ రెడ్డి ( ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు)

జాతీయం
02) పాకిస్తాన్ లోని కర్తార్ పుర్ గురుద్వారాకి భారత్ సరిహద్దుల్లోని డేరా బాబా నానక్ నుంచి నాలుగు వరుసల నడవాకి ఎవరు భూమి పూజ చేశారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
03) 2018 డిసెంబర్ 2న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఎవరు నియమితులు అవుతున్నారు ?
జ: సునీల్ అరోరా
04) ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు ?
జ: ఓ.పి. రావత్
05) రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతియేటా ఎప్పుడు జరుపుకుంటారు?
జ: నవంబర్ 26న
06) భారత అంతరిక్ష ప్రయోగం కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి 2018 నవంబర్ 29న ప్రయోగించనున్న వాహక నౌక ఏది ?
జ: PSLV-C43
07) PSLV-C43 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నారు ?
జ: హైపవర్ సెక్ర్టల్ ఇమేజింగ్ ( HYSIS) ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30 శాటిలైట్స్
08) 2018 నవంబర్ 29న ప్రయోగించే HYSIS శాటిలైట్ తో ఉపయోగం ఏంటి ?
జ: వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, భూగర్భ పరసరాల వివరాలు సేకరిస్తుంది
09) ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారమైన చెవాలియర్ డెలా లెజియన్ డిహానెర్ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ) దక్కించుకున్న భారతీయ పారిశ్రామిక వేత్త ఎవరు ?
జ: అజీమ్ ప్రేమ్ జీ ( ఐటీ దిగ్గజం )
10) ఇటీవల మరణించిన సి.కె. జాఫర్ షరీఫ్ ఎవరు ?
జ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
11) హాకీ ప్రపంచకప్ 2018 కి ఆతిథ్యమిస్తున్న దేశం ఏది ?
జ: భారత్
12) 2018 నవంబర్ 27 నుంచి హాకీ ప్రపంచ కప్ ఎక్కడ మొదలవుతోంది ?
జ: భువనేశ్వర్ (ఒడిశా)
13) హాకీ ప్రపంచ కప్ యొక్క అధికారిక చిహ్నం ఏది ?
జ: ఒలీ ( ఒలివ్ రిడ్లే సముద్ర తాబేలు )
నోట్: ఇవి ఒడిషాలోని రుషికుల్వ, గహిర్ మాత బీచ్ ల్లో కనిపిస్తాయి )
14) ప్రపంచ హాకీ కప్ ఇప్పటి దాకా భారత్ లో ఎన్ని సార్లు జరిగింది ?
జ: రెండు సార్లు
1982 (ముంబై)
2010 (ఢిల్లీ)
15) భారత్ లో జరుగుతున్న ప్రపంచ హాకీ కప్ లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి ?
జ: 16 జట్టు

అంతర్జాతీయం
16) మానవ పిండాల్లో జీన్ ఎడిటింగ్ తో ఇద్దరు పిల్లలను పుట్టించిన పరిశోధకుడు హే జియాంకుయ్ ఏ దేశానికి చెందిన వారు ?
జ: చైనా
17) ఎప్పుడు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ ను కూడా చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బిడ్ దాఖలు చేసింది ?
జ: 2022లో

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ