Monday, July 22

CURRENT AFFAIRS – NOV 2

తెలంగాణ
01) తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరి నియామకాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు ?
జ: జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి
02) గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది
జ: హైదరాబాద్ లోని HICC లో
03) హరిత నగరాల ఏర్పాటు ఉద్దేశ్యంతో హైదరాబాద్ లో నిర్వహించిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దిప్ సింగ్ పురి
04) దివ్యాంగుల విభాగం రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ఉప అధికారిగా ఎవరిని నియమించారు ?
జ: బి. శైలజ ( దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరక్టర్)
05) హైదరాబాద్ మెట్రో రైలుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. నగరంలోని ఏ మూడు స్టేషన్ల నిర్మాణాలు పర్యావరణ హితంగా ఉండటంతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ ప్లాటినం అవార్డు లభించింది ?
జ: రసూల్ పుర, ప్యారడైజ్, ప్రకాశ్ నగర్

జాతీయం
06) సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులైన నలుగురు ఎవరు ?
జ: 1) జస్టిస్ హేమంత్ గుప్తా (మధ్యప్రదేశ్ హైకోర్టు ), జస్టిస్ అజయ్ రస్తోగి (త్రిపుర హైకోర్టు ), జస్టిస్ ఎంఆర్ షా (పట్నా హైకోర్టు), జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి (గుజరాత్ హైకోర్టు)
07) సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు వీలుగా ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ప్రారంభించారు. ఆ సెంటర్ పేరేంటి ?
జ: సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్
08) ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: SS దేశ్వాల్
09) ఇటీవల సౌర జలనిధి పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్రం ఏది ?
జ: ఒడిశా
10) కోల్ కతా హైకోర్టు పరిధిలోకి వచ్చే కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?
జ: అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు
11) ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్ 2018 లో భారత్ ర్యాంక్ ఎంత ?
జ: 77వ ర్యాంక్
12) ఇరాన్ నుంచి మన దేశం రోజుకి ఎన్ని బ్యారళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది ?
జ: 4.52 లక్షల బ్యారెళ్ళు ( 2017-18)
13) అమెరికా ఆంక్షల ప్రకారం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురును ఎన్ని బ్యారెళ్ళకు కుదించుకోవాలి ?
జ: 3 లక్షల బ్యారెళ్ళు
14) సెల్ ఫోన్లు, నిఘా కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేందుకు తొలి స్వదేశీ మైక్రో ప్రాసెసర్లును ఎవరు అభివృద్ధి చేశారు ?
జ: ఐఐటీ మద్రాస్
15) ఎన్ని రకాల భారత వస్తువులకు దిగుమతి సుంకం విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 50 రకాలు
16) 21వ దశాబ్దంలో 100 విదేశీ ఉత్తమ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సినిమా ఏది ?
జ: పథేర్ పంచాలి ( 1955లో రిలీజ్ అయింది. సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన అద్భుత మూవీ)
17) ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో అధికారికంగా చోటు దక్కించుకున్న భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: రాహుల్ ద్రవిడ్

అంతర్జాతీయం
18) మహిళా ఉద్యోగులపై లైంగిక దుష్ప్రవర్తనపై ఏ సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా వాకౌట్ చేశారు ?
జ: గూగుల్

19) ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన జాబితా ప్రకారం దివంగత ప్రముఖుల్లో అత్యధిక చెల్లింపు పొందిన ఘనత ఎవరిది ?
జ: మైఖేల్ జాక్సన్ ( రూ.2,925 కోట్ల రూపాయల ఆదాయం )

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/