Tuesday, July 23

CURRENT AFFAIRS – NOV 18

రాష్ట్రీయం
01) ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏ పత్రిక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించింది ?
జ: ఎకనమిక్ టైమ్స్
02) ఎకనమిక్ టైమ్స్ సీఎం కేసీఆర్ కి ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆయన తరపున కేటీఆర్ అందుకున్నారు. ఈ అవార్డును ఎవరి చేతులమీదుగా అందుకున్నారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
03) ఆన్ లైన్లో ఉద్యోగాల నియామకానికి ఏ దేశ పబ్లిక్ సర్వీస్ కు సాంకేతిక సాయం అందించాలని TSPSC నిర్ణయించింది ?
జ: మారిషస్

జాతీయం
04) మాలెలో జరిగిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ దేశాధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: ఇబ్రహీం మహ్మద్ సోలిహె
05) ఎన్ ఫోర్స్ మెంట్ కి పూర్తి స్థాయి డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఎస్కే మిశ్రా ( సీనియర్ IRS అధికారి )
06) ప్రసార భారతి ఛైర్మన్ ఎవరు ?
జ: సూర్యప్రకాశ్
07) 1971లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన సైనికాధికారి చండీగడ్ లో క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: కుల్దీప్ సింగ్ చాంద్ పురి
08) ప్రముఖ యాడ్ గురు, నటుడు, దర్శకుడు, భారత్ ప్రకటనల రంగంలో బ్రాండ్ ఫాదర్ గా పిలిచే అలెక్ పదమ్ సీ కన్ను మూశారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
జ: మహారాష్ట్ర (100కు పైగా బ్రాండ్ లకు రూపకల్పన చేశారు )

అంతర్జాతీయం
09) తక్కువ ఖర్చుతో వైర్ లెస్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు 2020లోగా 12వేల ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించిన అమెరికాకి చెందిన ప్రైవేటు సంస్థ ఏది ?
జ: స్పెస్ ఎక్స్
10) గూగుల్ క్లౌడ్ కొత్త CEO గా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతి వ్యక్తి ఎవరు ?
జ: థామస్ కురియన్
11) ప్రపంచవ్యాప్తంగా బరువులు కొలిచేందుకు ఉపయోగించే కిలోగ్రామ్ కి కొత్త నిర్వచనం ఇవ్వాలని ఎక్కడ సమావేశమైన 50 దేశాలు నిర్ణయించాయి ?
జ: ఫ్రాన్స్ లోని వర్సెయిల్స్ లో
12) ఫ్రాన్స్ లోని ఓ హై సెక్యూరిటీ లాకర్ లో భద్రపరచిన ప్లాటినం-ఇరీడియం అల్లాయ్ గోళాన్ని కేజీకి ప్రమాణంగా పరిగణిస్తున్నారు. దీన్ని ఏ సంవత్సరంలో భద్రపరిచారు ?
జ: 1889లో

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ