Monday, December 17

CURRENT AFFAIRS – NOV 10

తెలంగాణ
01) చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంటును హైదరాబాద్ లోని యాచారంలో ఏర్పాటు చేసేందుకు నెట్ లింక్స్ లిమిటెడ్ కి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ నిర్ణయించింది. ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు ?
జ: 12 మెగావాట్లు
02) హైదరాబాద్ లో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఏది ?
జ: ఇంటెల్
03) బెజవాడ గోపాలరెడ్డి పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
జ: తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి
04) ఆచార్య మడుపు కులశేఖర్ రావు సాహితీ పురస్కారానికి ఎంపికైన సాహితీ వేత్త ఎవరు ?
జ: టి.గౌరీ శంకర్ ( పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి)
05) హైదరాబాద్ లో పర్యటించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరక్టర్ ఎవరు ?
జ: రమణన్ రామనాథన్

జాతీయం
06) అవినీతి నిరోధక చట్టం కింద పుదుచ్చేరిలో పదవి కోల్పోయిన ఎమ్మెల్యే ఎవరు ?
జ: అశోక్ ఆంనద్ (తట్టాం చావడి నియోజకవర్గం)
07) లద్దాక్ లో ఓ పురాతన భవనం పునరుద్దరణ కోసం చేపట్టిన పథకానికి ఏ పురస్కారం లభించింది ?
జ: యునెస్కో ఆసియా పసిఫిక్ పురస్కారం
08) కొత్తగా M777 తేలికపాటి అమెరికా హోవిట్జర్లు, K9 వజ్ర శతఘ్నులతో పాటు శతఘ్నులను తీసుకెళ్ళే సమీకృత వాహనాలను మహారాష్ట్రలోని దేవ్ లాలిలో జరిగిన కార్యక్రమంలో ఎవరు సైన్యంలో ప్రవేశపెట్టారు ?
జ: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
09) మహిళల టీ20 ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ లో భాగంగా గయానాలోని ప్రావిడెన్స్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి భారతీయురాలు ఎవరు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్

అంతర్జాతీయం
10) మిస్ ఇంటర్నేషనల్ 2018ని ఎవరు గెలుచుకున్నారు ?
జ: మారియం క్లారెట్ వెలాజ్కో గార్పియా
11) శ్రీలంక పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేశారు. దాంతో 21 నెలల ముందుగా 2019 జనవరిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు ఎవరు ?
జ: మైత్రీపాల సిరిసేన
12) అమెరికాలో ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమితులు కానున్నNRI ఎవరు ?
జ: ప్రొ. సురేశ్ వి. గరిమెళ్ళ
13) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనిషిలాగే హావభావాలు, కదలికలు ప్రదర్శించే రోబోను ప్రదర్శించిన దేశం ఏది ?
జ: చైనా (ఇంగ్లీష్, చైనీస్ లో వార్తలు చెబుతాడు)

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/