Monday, July 22

CURRENT AFFAIRS – NOV 01

తెలంగాణ
01) జాతీయ స్థాయి టెండర్ల ద్వారా రాష్ట్రానికి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను కేంద్ర విద్యుత్ శాఖ కేటాయించింది ?
జ: 550 మెగావాట్ల విద్యుత్
02) రాష్ట్రంలోని ఎన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిష్ట్రేషన్లకి స్లాట్ బుకింగ్ విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 141
03) 2018 నవంబర్ 3 న దేశంలోనే మొదటిసారిగా పొలిటికల్ హ్యాకథాన్ ను ఎక్కడ నిర్వహించనున్నారు.
జ: హైదరాబాద్ లో
(నోట్: స్థానిక సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా )

జాతీయం
04) సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల ఐక్యతా విగ్రహాన్ని గుజరాత్ లో ఏ నదీ తీరాన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ?
జ: నర్మదా నది
05) సర్దార్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన శిల్పి ఎవరు ?
జ: రామ్ వంజి సుతార్
06) సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ) ర్యాంకుల్లో భారత్ కి ఎంత స్థానం లభించింది ?
జ: 77వ ర్యాంకు (గత ఏడాది కంటే 23 స్థానాలు ఎగబాకింది )
07) 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ర్యాంక్ ఎంత ?
జ: 142 వ స్థానం
08) ఎప్పటి నుంచి రిజిష్టర్ అయ్యే ప్రజా రవాణా బస్సులకు వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజెస్ ( VLT), ఎమర్జన్సీ స్విచ్చ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది ?
జ: 2019 జనవరి 1 నుంచి
09) ఫ్లెక్సీ ఫేర్ - అనే విధానం ఏ రంగానికి చెందినది ?
జ: రైల్వేలు
(నోట్: ప్రీమియం రైళ్ళల్లో బెర్తులు నిండుతున్న కొద్దీ టికెట్ ధర పెరిగిపోవడాన్ని ఫ్లెక్సీ ఫేర్ అంటారు )
10) ఆసియా స్నూకర్ టూర్ రెండో అంచె విజేతగా ఎవరు నిలిచారు ?
జ: పంకజ్ అద్వాణీ
11) దేశీవాళీ క్రికెట్ లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో ఈసారి ఎన్ని క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి ?
జ: 37 జట్లు (ఈ ఏడాది కొత్తగా 7 ఈశాన్య రాష్ట్రాల జట్లు చేరాయి )
12) నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రాన్ని ఏ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్నారు ?
జ: 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

అంతర్జాతీయం
13) 2019 ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
జ: న్యూజిలాండ్
(నోట్: సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి )
14) 2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అమెరికా, చైనా, పాకిస్తాన్ స్థానాలు ఏవి ?
జ: అమెరికా - 8
చైనా - 46
పాకిస్తాన్ 136
15) గడచిన 44యేళ్ళల్లో వెన్నెముక ఉండే జంతువుల్లో ఎంత శాంత మూగ జీవాలు అంతరించాయని ప్రపంచ వన్యప్రాణి సంస్థ WWF తెలిపింది ?
జ: 60శాతం
16) మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ సస్పెండ్ చేసిన శ్రీలంక బౌలింగ్ కోచ్ ఎవరు ?
జ: నువాన్ జోయ్సా
17) దశాబ్దం పాటు సౌర కుటుంబం వెలుపల, ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల (ఎక్సో ప్లానెట్ ) ను పసిగట్టిన ఏ అంతరిక్ష టెలిస్కోప్ శకం ముగిసిపోయింది ?
జ: కెప్లర్ టెలిస్కోప్
18) కెప్లర్ టెలిస్కోప్ ను 2009 మార్చి 6న నాసా ప్రయోగించింది. అయితే తన జీవిత కాలంలో ఎన్ని ఎక్సో ప్లానెట్స్ ను ఇది గుర్తించింది ?
జ: 2600కు పైగా

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/