Monday, July 22

CURRENT AFFAIRS – MAY 7

రాష్ట్రీయం
01) తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ (DOST) ను విస్తరించండి ?
జ: Degree Online Services Telangana (DOST)
02) ఇప్పచెట్టు నీడలో అనే పుస్తకాన్ని రాసిన మాజీ IAS అధికారి ఎవరు ?
జ: దాసరి శ్రీనివాసులు

జాతీయం
03) ఫొని తుఫాన్ తో అతలాకుతలం అయిన ఒడిశాకి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ఎంత మొత్తాన్ని ప్రకటించింది ?
జ: రూ. 1000 కోట్లు
04) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: జస్టిస్ బాబ్డే
05) స్టార్టప్ ఇండియా విజన్ 2024 లో భాగంగా స్టార్టప్ లకు ఫండ్ రైజింగ్ చేసే సంస్థలకు ఆదాయం పన్ను నిబంధనలు మినహాయించిన కేంద్ర ప్రభుత్వ శాఖ ఏది ?
జ: Department of Promotion of Industry and Internal Trade ( DPIIT)
06) PC చంద్ర పురస్కార్ అవార్డు అందుకున్న గుండె వ్యాధి నిపుణులు, మానవతా వాది ఎవరు ?
జ: డాక్టర్ దేవీ ప్రసాద్ షెట్టి
07) లక్షదీవుల్లో ఉంటున్న మానవులు ఏ ప్రాంతానికి చెందిన వారని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, మంగళూరు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు ?
జ: దక్షిణాసియా
08) భారత వాలీబాల్ పురుషుల జట్టుకి కొత్త కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: డ్రాగన్ మిహెలో విక్
09) ఏ ఈ-కామర్స్ సంస్థకి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సంయుక్తంగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు ?
జ: Myntra
10) ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు ముగిసేవారకూ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సునీల్ శర్మ
11) గౌరవ్ సోలంకి అనే ఆటగాడు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఆయన ఏ క్రీడకు చెందినవారు ?
జ: బాక్సింగ్

అంతర్జాతీయం
12) మోమో-3 పేరుతో మొదటి ప్రైవేటు రాకెట్ ను ప్రయోగించిన దేశం ఏది ?
జ: జపాన్
13) జర్నలిస్ట్ వాజ్ హత్ ఎస్ ఖాన్ తో కలసి పాకిస్తాన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ రాసిన ఆటో బయోగ్రఫీ పుస్తకం పేరేంటి ?
జ: గేమ్ ఛేంజర్
14) ప్రతి యేటా ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: మే నెలలో మొదటి ఆదివారం
15) ప్రపంచవ్యాప్తంగా నవ్వుల యోగ ఉద్యమం ( Laughter Yoga Movement) ను ఎవరు ప్రవేశపెట్టారు ?
జ: డాక్టర్ మదన్ కత్రియా
16) సియా అభివృద్ధి బ్యాంక్ (ADB) అధ్యక్షుడు ఎవరు ?
జ: టకిహికో నకావో