Sunday, March 24

CURRENT AFFAIRS – MAY 31

రాష్ట్రీయం
01) రైతు బీమా పథకం కింద నమోదైన రైతుల్లో ఎవరైనా ఆత్మహత్మ చేసుకుంటే భారతీయ బీమా సంస్థ (LIC) ఎంత మొత్తం బీమా పరిహారం చెల్లించనుంది ?
జ: రూ. 5 లక్షలు
02) రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 24 రంగాల్లో సేవలందించిన ఎంతమందికి రాష్ట్రావతరణ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది ?
జ: 48 మందికి
03) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పారా గ్లైడింగ్ ను తెలంగాణ పర్యాటక సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తోంది ?
జ: బైసన్ పోలో మైదానంలో
04) శెనగలు, కందుల్లో పోషకాల లభ్యతను పెంచేందుకు ఇక్రిశాట్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇజ్రాయెల్ సంస్థ NRజీన్
05) గిరిజన ప్రాంతాల్లో సోలార్ తో వెలుగులు నింపుతున్న హైదరాబాద్ కు చెందిన ఏ సంస్థకి స్మార్ట్ విలేజ్ అవార్డు లభించింది ?
జ: ఫ్రేయర్ ఎనర్జీ
(నోట్: కేంద్ర పరిశ్రమల శాఖ, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, నాస్కామ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ సంయుక్తంగా ఈ అవార్డు ప్రకటించాయి)
06) అపెక్స్ ఇండియా ఎనర్జీ ఎఫీషియన్సీ అవార్డుకు ఎంపికైన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏది ?
జ: రామగుండం NTPC

జాతీయం
07) ఇండోనేషియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంతో 15 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు ?
జ: జోకో విడోడో
08) ఉర్దూతో సహా 15 భాషల్లో 18 వందల రకాలను ప్రచురిస్తున్న గీతా ప్రెస్ లేటెస్ట్ గా తెలుగులో ఏ పుస్తకాన్ని ముద్రించింది ?
జ: మహాభారతం
09) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా దేన్ని ప్రకటించారు ?
జ: వేప చెట్టు
(నోట్: ఏపీ రాష్ట్ర జంతువు - కృష్ణ జింక, రాష్ట్ర పక్షి - రామ చిలుక, రాష్ట్ర పుష్పం - మల్లెపువ్వు)
10) వాట్సాప్ కి పోటీగా యోగా గురు రాందేవ్ బాబా తెచ్చిన దేశీయ సరికొత్త మెసేజింగ్ యాప్ ఏది ?
జ: కింభో
11) 2018 సంవత్సరానికి భారత్ వ్రుద్ధి ఎంత శాతం ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది ?
జ: 7.3 శాతం ( గతంలో 7.5శాతంగా అంచనా వేసి... దాన్ని తగ్గించింది )
12) పంజాబ్ హరియాణా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు ?
జ: జస్టిస్ కృష్ణ మురారీ
13) కంట్రోల్ కిట్ సాయంతో పయనాన్ని నియంత్రించే పినాకా మార్క్ 2 ను ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారు ?
జ: ఒడిశాలోని చాందీపూర్ లో
14) ఆరోగ్య సేవల సూచీలో భారత్ స్థానం ఎంత ?
జ: 145 వ స్థానం
(నోట్: 32 వ్యాధుల ఆధారంగా దీన్ని రూపొందించారు. )
15) 2018 ప్రపంచ ప్రెస్ కార్టూన్ అవార్డ్స్ లో బెస్ట్ కేరికేచర్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న భారతీయ కార్టూనిస్ట్ ఎవరు ?
జ: థామస్ ఆంటోనీ
16) దేవికా నది పునరుత్సాదక ప్రాజెక్టుకి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: జమ్ము కశ్మీర్

అంతర్జాతీయం
17) ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కీపర్స్ (మే 29) యొక్క థీమ్ ఏది ?
జ: UN Peacekeepers : 70 Years of Service and Sacrifice

SI/PC/VRO/GR.II పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mock-tests/

రైల్వేలో గ్రూప్ - సి, డి ఉద్యోగాలకు గ్రాండ్ టెస్టులు, అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి:

https://telanganaexams.com/rrb-gt-tests/