Wednesday, October 17
Log In

CURRENT AFFAIRS – MAY 30

రాష్ట్రీయం
01) కొత్త సంస్కరణలు, వినూత్న సాంకేతిక వినియోగంతో వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు జలమండలికి ఏ అవార్డు దక్కింది ?
జ: అంతర్జాతీయ వాటర్ అసోసియేషన్

జాతీయం
02) రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డైరక్టర్ జనరల్ గా నియమితులైన క్షిపణి శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ టెస్సి థామస్
03) ఆఫీసు ఖర్చుల కింద మాజీ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు ఏటా గరిష్టంగా ఎంత చెల్లించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది ?
జ: మాజీ రాష్ట్రపతులకు రూ.లక్ష, మాజీ ఉపరాష్ట్రపతులకు రూ.90 వేలు
04) విద్యార్థులు బరువులెత్తే వెయిట్ లిఫ్టర్లు కాదనీ, వాళ్ళ స్కూల్ బ్యాగులు సరుకులు తరలించే కంటెయినర్లు కాదని ఏ హైకోర్టు వ్యాఖ్యానించింది ?
జ: మద్రాసు హైకోర్టు
05) భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త ఎవరు ?
జ: పంకజ్ శరణ్
06) అంతర్జాతీయ పబ్లికేషన్ ‘బారన్’ విడుదల చేసిన టాప్ 30 గ్లోబల్ CEO ల్లో స్థానం సాధించిన దక్కించుకున్న భారతీయుడు ఎవరు ?
జ: HDFC బ్యాంక్ మేనేజింగ్ డైరక్ట్ ఆదిత్య పురి
07) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుధా బాలకృష్ణన్
08) పర్యావరణ దినోత్సవాన్ని ప్లాస్టిక్ రహిత దినంగా పాటించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. అయితే ప్రతియేటా పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: జూన్ 5న

రాబోయే ఎగ్జామ్స్ దృష్ట్యా తెలంగాణ ఎగ్జామ్స్ యాప్/website ఎక్కువ మందికి చేరేలా చూడగలరు. అందుకోసం ఈ కింది యాప్ లింక్ ను మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో ఫార్వార్డ్ చేయండి:
https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams