Sunday, March 24

CURRENT AFFAIRS – MAY 29

రాష్ట్రీయం
1) రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు పెట్టాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి ?
జ: సురవరం ప్రతాప రెడ్డి
2) సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాల సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి పురస్కారంతో ఎవర్ని సత్కరించారు ?
జ: ప్రొ. ఎస్వీ రామారావు
3)చిక్కుడు, తృణ ధాన్యాలు పంటలపై పరిశోధనలకు హైదరాబాద్ కు చెందిన ఇక్రిశాట్ ఏ దేశానికి చెందిన బయోటెక్ సంస్థ కీజీన్ తో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: నెదర్లాండ్స్

జాతీయం
4) సహకార సమాఖ్యలో దేశ ప్రయోజనాలు అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో ఎప్పుడు సమావేశం జరగనుంది ?
జ: 2018 జూన్ 16న
5) జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడగా ఎవరు నియమితులయ్యారు?
జ: జస్టిస్ ఆర్.కె. అగర్వాల్
(నోట్: ప్రస్తుత అధ్యక్షుడు జస్టిస్ డి.కె.జైన్ పదవీ కాలం 2018 మే 31తో ముగుస్తోంది )
6) భారత్ - పాక్ సరిహద్దుల్లో తరుచుగా కాల్పులు జరుగుతుండటంతో అక్కడి ప్రజల కోసం ఎన్ని బంకర్లను నిర్మిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది ?
జ: 28,400
7) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుధా బాలకృష్ణన్
8) తమిళనాడులో వివాదస్పదంగా మారిన స్టెరిలైట్ కంపెనీని మూసేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వేదాంత గ్రూపునకు చెందిన ఈ కంపెనీ ఎక్కడ ఉంది ?
జ: తూత్తుకుడి
9) BSNL తో జతకట్టిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఏ పేరుతో సిమ్ కార్డులను ప్రవేశపెడుతోంది ?
జ: స్వదేశీ సమృద్ధి
10) ప్రకృతి ఖేతీ కుషాల్ కిసాన్ యోజన పేరుతో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: హిమాచల్ ప్రదేశ్
11) స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద ట్విన్ పిట్ టాయిలెట్ టెక్నాలజీ యాడ్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: అక్షయ్ కుమార్
12) ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో MOU కుదుర్చుకున్న సంస్థ ఏది ?
జ: టాటా ట్రస్ట్స్
13) భారత్ లో గ్రీన్ క్రికెట్ ను ప్రోత్సహించేందుకు BCCI, UN ఎన్విరాన్ మెంట్ మధ్య MOU కుదిరింది. UN ఎన్విరాన్ మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: నైరోబీ
14) బాగ్లీహార్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: జమ్ము కశ్మీర్
15) 2018 IPL సీజన్ 11లో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: సునీల్ నరైన్
16) ఆలిండియా జూనియర్ అండర్ 19 బ్యాడ్మింటన్ 2018 లో సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు ?
జ: ఆకర్షి కశ్యప్

అంతర్జాతీయం
17) ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫెలోషిప్ దక్కించుకున్న దక్షిణాఫ్రికాకి చెందిన భారత సంతతి మహిళ ఎవరు ?
జ: వీణా సహజ్ వాలా
(నోట్: శాస్త్రీయ రంగంలో రీసైక్లింగ్ విధానాల్లో మార్పులను కనుగొన్నారు )
18) పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా రెండు నెలల పాటు కొనసాగనున్న సుప్రీంకోర్టుమాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: నసీరుల్ ముల్క్

SI/PC/VRO/GR.II పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mock-tests/

రైల్వేలో గ్రూప్ - సి, డి ఉద్యోగాలకు గ్రాండ్ టెస్టులు, అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి:

https://telanganaexams.com/rrb-gt-tests/