Wednesday, November 13

CURRENT AFFAIRS – MAY 29 & 30

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్త ఆసరా ఫించన్లు జూన్ 2019 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై వృద్ధులకు, దివ్యాంగులకు ఎంత మొత్తం ఫించన్లు చెల్లించనున్నారు ?
జ: వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3,016 లు
(నోట్:గతలో ఒంటరి మహిళలు, చేనేత మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడి కార్మికులు, బోదకాలు వ్యాధి గ్రస్తులకు రూ.1000 నుంచి రూ.2016 లకు పెంచారు. దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016 లు పెంచారు )
02) వృద్యా్ప్య ఫించన్ మంజూరుకి వయో పరిమితి గతంలో 65 యేళ్ళు ఉండేది. ఇప్పుడు ఎంతకు కుదించారు ?
జ: 57 యేళ్ళు
03) ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి 10 తరగతుల వారికి దేన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రహదారి భద్రత
04) టి-హబ్ ల్యాబ్ 32లో ఎన్ని స్టార్టప్ లకు అవకాశం కల్పిస్తున్నట్టు టీ-హబ్ CEO రవి నారాయణ్ గా ప్రకటించారు ?
జ: 45 స్టార్టప్స్
05) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎంతశాతం మంది పొగ తాగుతున్నట్టు గ్లోబల్ అడల్ట్ టోబాకో సర్వే వెల్లడించింది ?
జ: ఏపీ 20 శాతం, తెలంగాణలో 17.8శాతం వినియోగదారులు

జాతీయం
06) DRDO తయారు చేసిన కొత్త రకం ఆకాశ్ పరీక్షను ఒడిశా తీరానికి దగ్గరలో బాలేశ్వర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఎక్కడి లక్ష్యాలను చేదించగలదు ?
జ: ఉపరితలం నుంచి గగనతలంలోకి
07) ఒడిశా మోదీగా పిలిచే ప్రతాప్ చంద్ర సారంగి ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు ?
జ: ఒడిశాలోని బాలాసోర్
08) నౌకాదళ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కరంబీర్ సింగ్
09) తూర్పు నావికాదళ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్
10) ప్రపంచంలో పోటినిచ్చే ఆర్థిక వ్యవస్థ జాబితాలో భారత్ స్తానం ఎ:త ?
జ: 43 వ స్థానం ( గతం కంటే ఒక ర్యాంకు మెరుగైంది )
11) మానవ సహిత అంతరిక్ష యాత్ర -గగన్ యాన్ కు ప్లాన్ చేస్తున్న ఇస్రో ఏ భారతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: భారతీయ వాయు సేనతో
12) ఏ దేశ పార్లమెంటులో ప్రసంగించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. ఆ దేశ పార్లమెంట్ తీర్మనాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ?
జ: మాల్దీవులు ( పార్లమెంట్ పేరు : పీపుల్స్ మజ్లిస్ )
13) ఇండియన్ టెరైన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మహేంద్ర సింగ్ ధోని

అంతర్జాతీయం
14) స్మార్ట్ ఫోన్ లో వీడియో గేమింగ్ కూడా అంతర్జాతీయ వ్యాధిగా ఏ సంస్థ గుర్తించంది ?
జ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO)
15) ప్రపంచంలో పోటినిచ్చే ఆర్థిక వ్యవస్థ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: సింగపూర్
(IMD వరల్డ్ కాంపిటేటివ్ నెస్ ర్యాంకింగ్స్ 2019 ఈ జాబితాను వెల్లడించింది )