Friday, November 15

CURRENT AFFAIRS – MAY 27 & 28

తెలంగాణ
01) జాతీయ స్థాయిలో ఉత్తమ వైద్య కళాశలల జాబితాలో తెలంగాణకి చెందిన ఏ రెండు హాస్పిటల్స్ కి స్తానం దక్కింది ( ఇండియా టుడే మేగజైన్ ఈ ర్యాంకులు వెల్లడించింది ) ?
జ: గాంధీ వైద్య కళాశాల ( 16వ) ఉస్మానియా కళాశాల ( 21 ర్యాంకు )
02) తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత ? అందులో అటవీ విస్తీర్ణం ఎంత ?
జ: రాష్ట్ర విస్తీర్ణం : 1,12,077 చ.కిమీలు, అటవీ విస్తీర్ణం : 26,904 చ.కి.మీ
03) ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిశాట్ పరిశోధకులు కలసి ఏ పంట జన్యు చిత్రాన్ని ఆవిష్కరించారు ?
జ: శనగలు, వేరు శనగలు
04) ధూమపాన రహిత హైదరాబాద్ గా తీర్చిదిద్దేందుకు ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించనుంది ?
జ: అక్టోబర్ 2 నుంచి
05) 2019 మే 22న హైదరాబాద్ లో ఓజోన్ కాలుష్య త్రీవత పరిమితి ఎంతగా నమోదైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు ?
జ: 110 మైక్రో గ్రామాలు
06) హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎన్ని చోట్ల ఓజోన్ కాలుష్య తీవ్రతను లెక్కించే స్టేషన్లు ఉన్నాయి ?
జ: ఆరు చోట్ల

జాతీయం
07) మే 30న ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి బిమ్ స్టెక్ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. బిమ్ స్టెక్ లో ఏయే దేశాలు ఉన్నాయి ?
జ: బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్
08) ఒడిశాలో ఐదోసారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఏ పార్టీకి చెందిన వారు ?
జ: బిజు జనతా దళ్
09) నవీన్ పట్నాయక్ ఇప్పటి దాకా ఎన్నేళ్ళు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు ?
జ: 19 యేళ్ళ 80 రోజులు
10) దేశంలో అత్యధికంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు ?
జ: సిక్కిం సీఎంగా పనిచేసిన పి.కె. ఛామ్లింగ్ ( 24 ఏళ్ళ 163 రోజులు )
పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేసిన జ్యోతి బసు (23 యేళ్ల 137 రోజులు )
11) అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ఎవరికి ఆహ్వానం అందింది ?
జ: పెమా ఖండూ
12) సిక్కిం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: ప్రేమ్ సింహ్ తమాంగ్ అలియాస్ పిఎస్ గోలే
13) 2021 నాటికి రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ పెరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో NDA కూటమికి ఎంతమంది సభ్యులు ఉన్నారు ?
జ: 99 మంది
14) అనిల్ అంబానీకి చెందిన బిగ్ ఎఫ్ ఎమ్ ను రూ.1050 కోట్లకు రిలయన్స్ గ్రూప్ ఎవరికి అమ్మింది ?
జ: రేడియో సిటీకి
15) ప్రపంచకప్ స్టేజ్ 3 రైఫిల్; పిస్టల్ షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో పతకం గెలిచి ...ప్రపంచకప్ లో రెండో స్వర్ణం సొంతం చేసుకున్న భారత స్టార్ షూటర్ ఎవరు ?
జ: అపూర్వి చందేలా

అంతర్జాతీయం
16) తమ దేశంలోని బ్యాంకుల్లో రహస్య ఖాతాల వివరాలను వెల్లడించేందుకు వీలుగా 11మంది భారతీయులకు నోటీసులు ఇచ్చిన దేశం ఏది ?
జ: స్విట్జర్లాండ్
17) చైనాలోని నానింగ్ లో జరిగిన ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ (టెన్నిస్ )లో పదకొండోసారి విజేతగా నిలిచిన దేశం ఏది ?
జ: చైనా
18) థాయ్ లాండ్ మాజీ ప్రధాని, ఆధునిక థాయిలాండ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తి చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ప్రేమ్ టిన్సులనోండా
19) గతంలో భారత క్రికెట్ జట్టుకు మెంటల్ ట్రైనర్ గా వ్యవహరించి, ది బేర్ ఫుట్ కోచ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?
జ: ప్యాడీ ఆప్టన్
20) ప్రతిష్టాత్మక ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2018 అవార్డును గెలుచుకున్న ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు ?
జ: నిలీనా ఎంఎస్
(నోట్: కిందటేడాది కోల్ గేట్ 2.0 పేరుతో రాసిన పరిశోధనాత్మక జర్నలిజ ఆర్టికల్ కు ఈ అవార్డు దక్కింది )