Sunday, June 24
Log In

CURRENT AFFAIRS – MAY 26

రాష్ట్రీయం
1) రెండో దశ రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కింద ఉస్మానియా యూనివర్సిటీకి నాణ్యత, శ్రేష్టత విభాగంలో ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ?
జ: రూ.100 కోట్ల నిధి
(నోట్: తెలంగాణకి మొత్తం రూ.242 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో కాకతీయ వర్సిటీకి రూ.50 కోట్లు కేటాయించింది )

జాతీయం
2) కోల్ కతాలోని శాంతినికేతన్ విశ్వభారతి విశ్వవిద్యాలయంలో బంగ్లాదేశ్ భవన్ ను ఎవరు ప్రారంభించారు ?
జ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
3) కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జస్టిస్ పూంఛి సిఫార్సులు దేనికి సంబంధించినవి ?
జ: కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
4) కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పూంఛి కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
జ: 2005లో
5) పూంఛీ కమిషన్ ఇచ్చిన ఎన్ని సిఫార్సులను అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం ఆమోదం వేసింది
జ: 273 సిఫార్సులు
6) ఒడిశా గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొఫెసర్ గణేషిలాల్
7) మిజోరాం గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కుమ్మనం రాజశేఖరన్
8) 8వేల మీటర్ల కన్నా ఎత్తయిన ఆరు పర్వతాలను, అత్యంత చిన్న వయస్సులో అధిరోహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు ?
జ: అర్జున్ వాజ్ పేయీ (భారత యువ పర్వతారోహకుడు )
9) ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలపై 2017-18 సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటును నిర్ణయించారు ?
జ: 8.55శాతం
10) రాష్ట్రంలో 18 యేళ్ళ నుంచి 59 యేళ్ళ రైతులకు రైతు బీమా పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2018 ఆగస్టు 15
(నోట్: రైతులందరికీ రూ.5లక్షల బీమా కల్పించనున్నారు. అందుకోసం భారతీయ జీవిత బీమా సంస్థ ( LIC) తో ఒప్పందం కుదిరింది )
11) ప్రముఖ క్రీడాకారుడు వీవీఎస్ లక్ష్మణ్ కు క్రీడా ప్రపూర్ణ ఇవ్వాలని ఏ యూనివర్సిటీ నిర్ణయించింది ?
జ: ఆంధ్ర విశ్వ విద్యాలయం

అంతర్జాతీయం
12) అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన హాలీవుడ్ నిర్మాత ఎవరు ?
జ: వీన్ స్టీన్
(నోట్: హాలీవుడ్ నిర్మాతల్లో దిగ్గజుడైన వీన్ స్టీన్ పై 80మంది నటీమణులు ఆరోపణలు చేశారు. దీంతో మీటూ ఉద్యమం మొదలైంది. అలాగే వీన్ స్టీన్ స్కామ్ లు బయటపెట్టినందుకు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులకు పులిట్జర్ బహుమతి కూడా లభించింది )
13) రంజాన్ కు ముందు రెండు రోజుల ముందు సెలవులు ముగిసిన రెండు వారాల వరకూ బాలీవుడ్ తో పాటు విదేశీ చిత్రాలను నిషేధించిన దేశం ఏది ?
జ: పాకిస్తాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *