Monday, October 15
Log In

CURRENT AFFAIRS – MAY 25

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్ని జోన్ లను ఏర్పాటు చేసింది ?
జ: ఏడు జోన్లు ( రెండు మల్టీ జోన్లు )
2) పెట్రోల్, డీజెల్ ఇతర ఇంధనాలు తరలించడానికి పారదీప్ - హైదరాబాద్ మధ్య 2020 నాటికి పైప్ లైన్ నిర్మించనున్నారు. ఏ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది ?
జ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
3) 253 ఎకరాల్లో మల్టీ సెక్టార్ సెజ్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని GMR ప్రతిపాదించింది ?
జ: శంషాబాద్ లో
4) ప్రపంచ ప్రఖ్యాత చిత్రోత్సవం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన తెలుగు సినిమా ఏది ?
జ: ఫ్రెండ్స్ ఇన్ లా

జాతీయం
5) ప్రధాని నరేంద్ర మోడీతో న్యూ ఢిల్లీలో సమావేశమైన నెదర్లాండ్స్ ప్రధాని ఎవరు ?
జ: మార్క్ రూట్
6) కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్ విషయంలో ప్రత్యేక యాంటీబాడీని అందించాలంటూ భారత్ ఏ దేశాన్ని సాయం కోరింది ?
జ: ఆస్ట్రేలియా
7) ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరు ?
జ: ధర్మేంద్ర ప్రధాన్
8) 2018-19 నాటికి భారత్ ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది ?
జ: 7.5శాతం
9) మహారాష్ట్రలోని ఏ అభయారణ్యంలో నల్లపులి కనిపించినట్టు అటవీశాఖాధికారులు ధృవీకరించారు ?
జ: తాడోబా అభయారణ్యం

అంతర్జాతీయం
10) అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మధ్య 2018 జూన్ 12న జరగాల్సిన సమావేశం రద్దయింది. దీన్ని ఎక్కడ నిర్వహించాలని అనుకున్నారు ?
జ: సింగపూర్ లో
11) ఏ అణు పరీక్ష కేంద్రాన్ని ఉత్తరకొరియా ధ్వంసం చేసింది ?
జ: పుంగ్యే- రీ
12) 21వ శతాబ్దం నాటికి భూఉష్ణోగ్రతలు అదనంగా ఎన్ని డిగ్రీలు పెరుగుతాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన పరిశోధనలో తేలింది ?
జ: 4 డిగ్రీలు
13) ఒక భారత మహిళ మృతికి కారణమైన అబార్షన్ చట్ట విరుద్ధమనే నిబంధనపై ఏ దేశంలో రిఫరెండం జరుగుతోంది ?
జ: ఐర్లాండ్ లో