Wednesday, November 13

CURRENT AFFAIRS MAY 25 &26

రాష్ట్రీయం
01) పటాన్ చెర్వు, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పునరుద్దరణకు పటాన్ చెరువ బొల్లారం పర్యవారణ సహాయ నిధి కార్పస్ ఫండ్ వినియోగానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ?
జ: సీఎస్ ఎస్ కే జోషి
02) విద్యుత్ కర్మాగారాల నుంచి వెలువడే కాుష్యాన్ని నివారించేందుకు ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ నిర్మాణాలను ( కాలుష్య నియంత్రణ ప్లాంట్ ) ను ఎక్కడ నిర్మిస్తున్నారు.
జ: కేటీపీఎస్ లో
03) సంప్రదాయేతర ఇంధన వనరుల వినయోగాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకు ఏ సంస్థకి ఢిల్లీలో జరిగిన ఐదో స్మార్ట్ సిరీస్ సదస్సులో పురస్కారం లభించింది ?
జ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)

జాతీయం
04) ఇటీవల నియమితులైన నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు చేరుకుంది ?
జ: 31కి
(నోట్: పార్లమెంట్ ఆమోదించిన మేరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తయింది )
05) 17వ లోక్ సభ కు జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎంత మంది సిటింగ్ సభ్యులు తిరిగి ఎంపీలుగా ఎన్నికయ్యారు ?
జ: 197 మంది

అంతర్జాతీయం
06) ప్రపంచ ఇంటర్నెట్ కవరేజ్ కోసం వెయ్యి చిన్న ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగా మొదటి దశలో ఎన్ని ఉపగ్రహాలను పంపారు ?
జ: 60 ఉపగ్రహాలు
07) బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పదవికి రాజీనామా చేశారు. మే 7న పదవీ నుంచి వైదొలుగున్నట్టు ప్రకటించారు. ఆమె ఏ పార్టీకి చెందిన వారు ?
జ: కన్జర్వేటివ్ పార్టీ
08) మొదటిసారిగా 2024 కల్లా చంద్రుడి పైకి ఓ మహిళా వ్యోమగామిని సిద్ధం చేస్తున్న సంస్థ ఏది ?
జ: నాసా (అమెరికా)
09) నాసా అపోలో 11 మిషన్ ద్వారా మొదటిసారి చంద్రుడిపై మనిషి కాలు మోపింది ఎవరు ?
జ: 1969 జులై 20