Sunday, March 24

CURRENT AFFAIRS – MAY 24

రాష్ట్రీయం
1)మిషన్ కాకతీయ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఎన్ని చెరువులను బాగు చేసినట్టు మంత్రి హరీష్ రావు ప్రకటించారు ?
జ: 18,000
2) ఇంటర్నేషనల్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీలో భాగంగా బ్రిటీష్ పార్లమెంట్ లో (హౌజ్ ఆఫ్ లార్డ్స్ లో) తెలంగాణకు చెందిన ఏ నృత్యాన్ని ప్రదర్శించారు ?
జ: మథురి నృత్యం

జాతీయం
3) ఏ రాష్ట్రంలో నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాల కోసం బ్లాక్ పాంథర్ పేరుతో గ్రే హౌండ్స్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు ?
జ: ఛత్తీస్ గఢ్
4) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( PCI) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ సీకే ప్రసాద్
5) ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న టాప్ పథకం నుంచి ఏ ప్రముఖ ప్లేయర్ ను తొలగించారు ?
జ: సానియా మీర్జా
6) దేశంలో తొలి క్రీడ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: మణిపూర్ లో (ఇంఫాల్ వెస్ట్ లో )
7) భారత్ లో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ను ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: మే 21
8) నీతి ఆయోగ్ CEO ఎవరు ?
జ: అమితాబ్ కాంత్
9) గాండీవ్ విజయ్ పేరుతో ఏరాష్ట్రంలో విన్యాసాలు జరుగుతున్నాయి ?
జ: రాజస్థాన్
10) ఏపీలోని ఏ ప్రాంతంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది ?
జ: నాగాయలంక బ్లాక్ ( కృష్ణా జిల్లా)
11) 2018 అత్యంత నమ్మికమైన బ్రాండ్ గా ఎకనామిక్ టైమ్స్ గుర్తించిన కంపెనీ ఏది ?
జ: గ్రీన్ లైట్ ప్లానెట్ ( Most Promising Brand 2018)
12) 20మే 2018 నాడు కోయంబత్తూర్ లో జరిగిన ఫార్ములా జూనియర్ రేసింగ్ సిరీస్ 2018 ఛాంపియన్షిప్ గెలుచుకున్నది ఎవరు ?
జ: బాలా ప్రశాంత్
13) బోర్నాడీ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: అసోం
14) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యొక్క ట్యాగ్ లైన్ ఏది ?
జ: Where every individual is committed
15) రంజిత్ సాగర్ డ్యామ్ ఏ నది ఒడ్డుపై నిర్మించారు ?
జ: రావి నది
16) ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఛైర్మన్ ఎవరు ? ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: డాక్టర్ గురు ప్రసాద్ మహోపాత్ర, ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ

అంతర్జాతీయం
17) బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ తన అమెరికాస్ రీజినల్ ఆఫీస్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: బ్రెజిల్
18) మలేసియా ప్రభుత్వంలో మొదటి సిక్కు మంత్రిగా నియమితులైన భారతీయ సంతతి వ్యక్తి ఎవరు ?
జ: గోవింద్ సింగ్ దియో
19) కాస్మిక్ రేడియేషన్ కారణంగా మెదడు దెబ్బతినకుండా ఏ పేరుతో కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు ?
జ: PLX5622
20) 22మే 2018 నాడు నిర్వహించిన ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే యొక్క థీమ్ ఏది ?
జ: Celebrating 25 Years of Action for Biodiversity