Friday, November 15

CURRENT AFFAIRS MAY 23

తెలంగాణ
01) విలక్షణమైన శైలితో ఆధునిక చిత్రకళను ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన ఎవరు ?
జ: సూర్య ప్రకాష్
02) దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డైనో వరల్డ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిలాల గ్రామం
03) దేశంలోనే 13 రాష్ట్రాల కన్నా హైదరాబాద్ లోనే రోజువారీ విద్యుత్ వినియోగం ఎక్కువగా జరిగింది. ఎంత విద్యుత్ ను గ్రేటర్ హైదరాబాద్ వాసులు వినియోగించారు ?
జ: 3,276 మెగావాట్లు
04) రాష్ట్రంలో మిషన్ కాకతీయ కార్యక్రమం కింద జరిగిన ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం ఏ సంస్థతో అధ్యయనం చేయనుంది ?
జ: ఇక్రిశాట్ సంస్థ

జాతీయం
05) సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు న్యాయమూర్తులు ఎవరు ? కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
జ: 1) జస్టిస్ బోపన్న 2) జస్టిస్ సూర్యకాంత్ 3) జస్టిస్ బోస్ 4) జస్టిస్ గవాయ్
06) భారత సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఉపయోగపడే రీశాట్ - 2బీ ని ఏ రాకెట్ ద్వారా 2019 మే 22నాడు శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు ?
జ: PSLV C-46 ( రీశాట్ -2బీ - రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ )
07) వ్యవసాయ రంగం, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవలు అందించేందుకు వీలుగా ప్రయోగించిన ఏ నిఘా ఉపగ్రహాన్ని షార్ నుంచి ప్రయోగించారు ?
జ: రీశాట్ 2బీ ( ఉగ్రవాద కదలికలతో పాటు ఈ అవసరాలను కూడా తీర్చనుంది)
08) చంద్రయాన్ 2 ను ఎప్పు నిర్వహిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ తెలిపారు ?
జ: 2019 జులై 9 నుంచి 16 లోపు
09) సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్ ను భారత వైమానిక దళం (IAF) విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని ఏ యుద్ధ విమానం నుంచి పరీక్షించారు ?
జ: సుఖోయ్ యుద్ధ విమానం SU-30 MKI
10) భారత వైమానిక దళం లో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన మొదటి మహిళ ఎవరు ?
జ: భావనా కంఠ్
11) భావనా కంఠ్ ఏ యుద్ధ విమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన సిలబస్ ను పూర్తి చేశారు ?
జ: మిగ్ 21బైసన్ విమానం
12) రైలు బ్రేకులు వేసినప్పుడు, వేగం పెంచినప్పుడు కుదుపులు ఉండవు, ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒక దానిపై ఒకటి దూసుకుపోవు... అందుకోసం కొత్త కప్లర్స్ ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ నిర్ణయించింది ? వీటిని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ?
జ: అమెరికా ( అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రైల్ రోడ్ ఫర్ హైస్పీడ్ కంపెనీ)
13) ఓట్లు లెక్కించిన తర్వాత అధికారిక ఫలితాలను ఎన్నికల సంఘం ఏ యాప్ లో నమోదు చేసింది ?
జ: సువిధ యాప్
14) సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి అసెబ్లీ నియోజకవర్గంలో ఎన్ని వీవీ ప్యాట్స్ స్లిప్పులను లెక్కించారు ?
జ: ఐదు వీవీ ప్యాట్స్
15) 542 లోక్ సభ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎంతమంది బరిలో నిలిచారు ?
జ: 8,049 మంది
16) 2019 ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ ఎన్ని దశల్లో భారత్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ?
జ: ఏడు దశల్లో
17) మొత్తం లోక్ సభ స్థానాలు 543. అయితే 542 లోక్ సభ సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగని స్థానం ఏది ?
జ: వెల్లూరు (తమిళనాడు )
(నోట్: ఇక్కడ విచ్చలవిడిగా డబ్బులు వినియోగించారనే ఆరోపణలు రావడంతో ఎన్నికల్ని రద్దు చేశారు )

అంతర్జాతీయం
18) సాహిత్య రంగంలో అందించే ప్రఖ్యాత మాన్ బుకర్ ప్రైజ్ 2019ని దక్కించుకున్న తొలి అరబ్ మహిళ ఎవరు ?
జ: జోఖా అల్ హార్తి ( ఒమన్ కు చెందిన రచయిత్రి)
19) జోఖా అల్ హార్తి రాసిన ఏ నవలకు మాన్ బుకర్ ప్రైజ్ 2019 దక్కింది ?
జ: సెలస్టియల్ బాడీ
20) సెలస్టియల్ బాడీ ఇతివృత్తం ఏంటి ?
జ: 1951 లో స్వాతంత్ర్యం పొందాక ఒమన్ లో జరిగిన మార్పులు, బానిసత్వం పరిస్థితులు
21) ఏ గ్రహం అంతర్గత అయస్కాంత క్షేత్రం కాలక్రమంలో మార్పులకు లోనవుతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వ్యోమ నౌక గుర్తించింది ?
జ: జూపిటర్
22) 2020లో ఏ గ్రహంపైకి పంపే రోవర్ లో 20 లక్షల మందికి పైగా జనం పేర్లు పంపుతామన్న నాసా ప్రకటించింది ?
జ: అరుణ గ్రహం