Wednesday, November 13

CURRENT AFFAIRS – MAY 21 & 22

రాష్ట్రీయం
01) తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎన్ని కోట్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు ?
జ: రూ. 1.82 లక్షల కోట్లు
02) రాష్ట్ర అప్పులు రూ.1.82 లక్షల కోట్లల్లో తెలంగాణ ఏర్పడకముందు ఉన్న అప్పులు ఎన్ని ?
జ: రూ.82 వేల కోట్లు
03) 2018-19 లో రాష్ట్ర GSDP ఎన్ని కోట్లు ?
జ: రూ.8,65,875 కోట్లు
04) గత ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు ఎంతగా నమోదైంది ?
జ: 15శాతం
05) రాష్ట్రంలో రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించిన మున్సిపాలిటీ ఏది ?
జ: కరీంనగర్ నగర పాలిక సంస్థ
06) ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ప్రొ. మడుపు ఎం. కులశేఖర్ రావు కెనడాలో కన్నుమూశారు. ఆయన ఏ విభాగంలో చేసిన పరిశోధనలకు డాక్టరేట్ పొందారు ?
జ: ఆంధ్ర వచన వాజ్ఞ్మయ విజ్ఞానం
07) డాక్టర్ మడుపు ఎం. కులశేఖర్ రావు ఆంగ్లంలో రచించిన ఏయే గ్రంథాలకు మంచి గుర్తింపు వచ్చింది ?
జ: తెలుగు సాహిత్య చరిత్ర, డాక్టర్ సి.నారాయణ రెడ్డి సాహిత్య బహుముఖ వ్యక్తిత్వంపై
08) తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు పుస్తకాలను సీఎస్ ఎస్ కే జోషి ఆవిష్కరించారు. ఆ గ్రంథాలు, రచయితల పేర్లేంటి ?
జ: తారీఖుల్లో తెలంగాణ - పెన్నా శివరామకృష్ణ
తెలంగాణ రాష్ట్రంలోని పురాతన కట్టడాలు - యువ పరిశోధకుడు అరవింద్
ఆర్య, తెలుగు రుచులపై శాఖాహార, మాంసాహార వంటల వివరాలు, వాటి తయారీ - జ్యోతి వలబోజు
09) మెట్రో రైల్వే స్టేషన్లలో ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందో తెలుసుకోడానకి ఉద్దేశించిన యాప్ ఏది ?
జ: పార్క్ హైదరాబాద్
10) యామన్ పల్లి వంతెన రివెట్ మెంట్ లో 20 కోట్ల యేళ్ల నాటి డైనోసార్ అవశేషాలు, నాటి తాబేలు శిలాజాలు బటయపడ్డాయి. ఇది జిల్లాలో వెలుగులోకి వచ్చాయి ?
జ: మంచిర్యాల జిల్లా
11) 1980లో జీఎస్ఐకి చెందిన తెలుగు పరిశోధకుడు ఈ ప్రాంతంలోనే రాక్షబల్లి శిలాజాలను గుర్తించారు. ఆయన పేరేంటి ?
జ: పొన్నాల యాదగిరి
12) కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు రూ.14వేల కోట్ల రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థ ఏది ?
జ: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
13) వరంగల్ కేంద్రంగా నడుస్తున్న కాకతీయ ఎడ్యుకేషన్ ఎన్వైర్ మెంట్ ఎకనమిక్ డెవలప్ మెంట్ సొసైటీకి ( కీడ్స్ ) కు ఏ అవార్డు లభించింది ?
జ: రాజీవ్ గాంధీ సమాజ్ రత్న అవార్డు (కాంగ్రెస్ పార్టీ ఈ అవార్డు ఇస్తుంది )

జాతీయం
14) కిలోగ్రాము, కెల్విన్, మోల్, ఆంపియర్ యూనిట్ల కొలతల్లో మార్పులకు భారత్ అంగీకరించింది. ఈ మార్పులను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
జ: 2019 వాతావరణ శాస్త్రం దినమైన మే 20 నుంచి
15) ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగింటికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ 2018 నవంబర్ 16న ఎక్కడ జరిగిన సమావేశంలో తీర్మానం చేశాయి ?
జ: పారిస్ లో
16) ప్రామాణిక కొలతలకు సంబంధించి మెట్రిక్ వ్యవస్థను వందకు పైగా దేశాలు ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాయి ?
జ: 1889 నుంచి
17) శాంతి పరిరక్షణలో అమరులైన భారత్ పోలీస్ అధికారికి ఐక్యరాజ్యసమితి హామర్ షల్డ్ పురస్కారం ప్రకటించింది. అతను ఎవరు ?
జ: జితేందర్
( నోట్ : జితేందర్ కాంగోలో ఐరాస తరపున సేవలు అందిస్తూ చనిపోయారు. ఈ ఏడాది విధి నిర్వహణలో చనిపోయిన మొత్తం 119 మంది మిలటరీ, పోలీస్ అధికారులకు ఐరాస ఈ అవార్డులు అందించింది )
18) త్వరలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం అవుతున్న బ్యాంకులు ఏవి ?
జ: ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్
19) గత నెల ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 800 మీటర్ల పరుగు పందెంలో రన్నరప్ గా గెలిచిన క్రీడాకారిణి నెల తిరక్క ముందే నిషేధిత ఉత్ర్పేరకాలు వాడి డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ఆమె ఎవరు ?
జ: గోమతి మరిముత్తు
20) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని 24వ సారి అధిరోహించి తన రికార్డును తానే బద్దలు కొట్టిన 50యేళ్ళ భారత్ బృంద అధిరోహకుడు ఎవరు ?
జ: కమి రిట షేర్ఫా

అంతర్జాతీయం
21) జన్యువుల ఆధారంగా రోగుల తీరుతెన్నులు తెలుసుకొని వారికి వైద్యం చేసే విధానంతో రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పేరేంటి ?
జ: ఫ్లై
22) ఈ ఫ్లై అనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ను ఏ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు
జ: ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ
23) ఎబోలాపై ఉమ్మడి పోరు చేయాలని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వివిధ రాజకీయ వర్గాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) అధిపతి పిలుపునిచ్చారు. ప్రస్తుతం WHO డైరెక్టర్ ఎవరు ?
జ: టెడ్రోస్ అడ్హోనం గెబ్రెయెసన్
24) యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పై ప్రపంచ స్థాయి సదస్సును 2019 సెప్టెంబర్ లో ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: భారత్ ( హైదరాబాద్ లో )
25) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటును ఎంతగా OECD( ఆర్థిక సహకరా, అభివృద్ధి సంస్థ ) నిర్ణయించింది ?
జ: 3.2 శాతం
(నోట్: గతంలో 3.3 శాతంగా చెప్పింది. దీనిపై కోత విధించింది )
26) సముద్రం గడ్డ కట్టకుండా వాయువులతో కూడిన పొర విద్యుద్భంధనంగా ఏ గ్రహంపై పనిచేస్తోందని జపాన్ లోని హౌక్కైడో విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలింది ?
జ: ఫ్లూటో గ్రహంపై

 

ఈవీఎంల, వీవీ ప్యాట్స్, నోటా బటన్ (వీడియో)
నిజామాబాద్ లో వాడిన m3 ఈవీఎంలు తెలుసా?
http://telanganaexams.com/evm-video/

జూన్ లోనే పోలీస్ ట్రైనింగ్ ప్రారంభం
1000మంది ట్రైనర్స్ తో 17వేల మందికి శిక్షణ
http://telanganaexams.com/police-training/

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ