Sunday, August 25

CURRENT AFFAIRS – MAY 20

తెలంగాణ
01) రాష్ట్రంలోని కాళేశ్వరం ముక్తేశ్వరం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు ?
జ: రూ.100 కోట్లు
02) కళ్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఎంత ?
జ: రూ.1,00,16 లు
03) గ్రామాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ ( NPDCL) ఎన్ని గ్రామాలను దత్తత తీసుకోనుంది ?
జ: 513 గ్రామాలు
04) గ్రామాల్లో ఏ చెట్లు క్షీణిస్తుండటంతో ఐదో విడత హరితహారంలో 5 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: చింత చెట్లు

జాతీయం
05) డిజిటల్ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 జనవరిలో నియమించిన కమిటీ తన నివేదికను 2019 మే 17న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కి సమర్పించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: నందన్ నీలేకని (ఐదుగురు సభ్యుల బృందం)
06) ఇటీవల ఒడిశాలో బీభత్సం సృష్టించిన ఫొని తుఫాన్ కు పేరు పెట్టింది బంగ్లాదేశ్. అయితే ఫొని అంటే అర్థం ఏంటి ?
జ: పాము పడగ
07) యునెస్కో వారసత్వ జాబితాలో భారత్ నుంచి దేనికి చోటు దక్కింది ?
జ: కైలాస్ మానస్ సరోవర్
08) సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ: విరాట్ కోహ్లీ ( 10 కోట్ల మంది )
09) 2019 మే 30 నుంచి ఇంగ్లండ్ లో మొదలయ్యే ఐసీసీ ప్రపంచకప్ లో 22 మంది అంపైర్లు, రిఫరీల జాబితాను ప్రకటించారు. ఇందులో భారత్ నుంచి ఎవరికి అవకాశం దక్కింది ?
జ: సుందరం రవి
10) అంతర్జాతీయ క్రీడా సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మొదటిసారి ప్రపంచ నంబర్ వన్ గా నిలిచిన భారత్ క్రీడాకారిణి ఎవరు ?
జ: అపూర్వీ చండేలా

అంతర్జాతీయం
11) ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన స్పెయిన్ ప్లేయర్ ఎవరు ?
జ: రఫెల్ నాదల్
(నోట్: టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ను ఓడించాడు. నాదల్ అత్యధికంగా 34 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు)
12) LGBT, స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలకు చట్టబద్ధమైన ఆమోదం తెలిపిన మొదటి ఆసియా దేశం ఏది ?
జ: తైవాన్