Wednesday, November 13

CURRENT AFFAIRS – MAY 18 & 19

తెలంగాణ
01) 2019 జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను గోల్కొండలో కాకుండా పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఇక్కడ గతంలో ఏపీ రాష్ట్ర వేడుకలు మొదటిసారిగా ఎవరి హయాంలో ఎప్పుడు నిర్వహించారు ?
జ: 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి
02) రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పథకం కింద వచ్చే నెల నుంచి ఎకరానికి ఎంతమొత్తాన్ని జమచేయనున్నారు ?
జ: రూ.5000 ( గతంలో రూ.4 వేలుగా ఉండేది )
03) తెలంగాణ గత చరిత్ర నుంచి నేటి వరకూ రాజకీయ పరిణామాలతో పాటు మార్పులను అధికారికంగా గెజిట్ లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం గెజిట్ ను రూపొందించే బాధ్యతను ఎవరికి అప్పగించింది ?
జ: సెస్ ( సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ )
04) హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి తొలి గెజిట్ ను ఎప్పుడు విడుదల చేశారు ?
జ: 1909లో
05) దాదాపు కనుమరుగు అయిందనుకున్న రాబంధు హైదరాబాద్ లో కనిపించింది. ఎన్నేళ్ల తర్వాత ఇది హైదరాబాద్ లో కనిపించినట్టు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు ?
జ: 20 యేళ్ల తర్వాత
06) రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఎప్పటి నుంచి నిత్యకళ్యాణాలు ప్రారంభం అయ్యాయి ?
జ: 2019 మే 18 నుంచి
07) రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని మండలాల్తో గత ఏడాది వర్షపాతం లోటు ఉందని భూగర్భ జలశాఖ వెల్లడించింది ?
జ: 299 మండలాల్లో
08) రాష్ట్రంలో అంబేద్కర్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది ?
జ: ఉస్మానియా యూనివర్సిటీలో ( ఇందులో అంబేద్కర్ కు సంబంధించి 25వేల పుస్తకాలను సేకరించారు )

జాతీయం
09) ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో పాటు ఉన్న కమిషనర్లు ఎవరు ?
జ: అశోక్ లావాసా, సుశీల్ చంద్ర
10) బుద్ధుడి జీవిత ఘట్టాల ఆధారంగా రెండో శతాబ్దంలో రూపొందించిన ఫణిగిరి శిల్పం ఏ నగరంలో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది ?
జ: న్యూయార్క్
11) 18 వందల యేళ్ల నాటి ఫణిగిరి శిల్పం ఎక్కడ దొరికింది ?
జ: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో
12) దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమైన లోక్ పాల్ కు వెబ్ సైట్ ను మే 16న ప్రారంభించారు. లోక్ పాల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2019 మార్చి 19 నుంచి
13) అధిక హార్స్ పవర్ (140kmp) కలిగిన 100వ రైలు ఇంజన్ అందుబాటులోకి వచ్చింది. DAP-7 సిరీస్ లోని ఈ ఇంజన్ కు ఏమని పేరు పెట్టారు ?
జ: శతాశ్వ్
14) శతాశ్వ్ ను ఎక్కడ తయారు చేశారు ?
జ: సికింద్రాబాద్ లోని లాలా గూడ ఎలక్ట్రికల్ లోకోషెడ్ లో

అంతర్జాతీయం
15) ఆస్ట్రేలియా ఎన్నికల్లో లిబరల్ కూటమిగెలుపు ద్వారా ఎవరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ?
జ: ప్రస్తుత ప్రధాని స్కాట్ మోరిసన్
16) ఇంగ్లండ్ లో ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ అధికారిక గీతాన్ని ఐసీసీ విడుదల చేసింది. దాని పేరేంటి ?
జ: స్టాండ్ బై (గాయకులు : లోరెన్ రుడిమెంటల్ కలసి ఈ పాట రూపొందించారు)
17) ఈసారి క్రికెట్ ప్రపంచ కప్ విజేతకు ఎంత మొత్తం బహుమతిని ఐసీసీ ఇవ్వనుంది ?
జ: రూ.28 కోట్లు (రన్నరప్ కి రూ.14కోట్లు)
18) 2019 మే 15తో ఈఫిల్ టవర్ ఎన్నేళ్ళు పూర్తి చేసుకుంది ?
జ: 130 యేళ్ళు

మన యూట్యూబ్ క్లాసులకు సంబంధించిన ఈ కింది లింక్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఛానెల్ subscribe అవ్వమని చెప్పండి.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true