Monday, December 16

CURRENT AFFAIRS MAY 15

తెలంగాణ
01) కర్ణాటకలోని ఏ ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాలకు కృష్ణా జలాలు చేరుకున్నాయి ?
జ: నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి
02) రాష్ట్రంలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (NMDC) లో సరైన ధర లేక 75 రోజులుగా స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి ఆగిపోయింది. స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఎక్కడ ఉంది ?
జ: పాల్వంచ ( భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
03) హైదరాబాద్ ను వరద నీరు ముంచెత్తకుడా రూ.407 కోట్లతో 1548 కిమీ ల పైపు లైన్లతో నీటిని 650 చెరువుల్లోకి పంపే ప్రతిప్రాదనలను తయారు చేసిన సంస్థ ఏది ?
జ: JNTU
04) రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏయే కార్పోరేషన్ల నుంచి రూ.32 వేల కోట్లు రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన
05) రాష్ట్రంలో 10.8 కోట్ల చేప పిల్లల ఉత్పత్తే లక్ష్యంగా మత్య్సశాఖ కొత్తగా ఎన్ని ఎకో హేచరీలను ఏర్పాటు చేస్తోంది ?
జ: ఆరు హేచరీలు

జాతీయం
06) ఫిజి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ మదన్ బి లోకూర్
07) జస్టిస్ మదన్ బి లోకూర్ నాన్ రెసిడెంట్ ప్యానెల్ లో భాగంగా ఫిజీ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఎన్నేళ్ళు ఈ పదవిలో ఉంటారు ?
జ: మూడేళ్ళు
08) రాజీనామా చేసిన జెట్ ఎయిర్ వేస్ CEO ఎవరు ?
జ: వినయ్ దూబే
09) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మ్యాచ్ రిఫరీ ప్యానెల్ లో స్థానం దక్కించుకున్న మొదటి మహిళ ఎవరు ?
జ: గండికోట సర్వ లక్ష్మి (GS LAXMI) (ఆంధ్రప్రదేశ్)

అంతర్జాతీయం
10) చందమామ అంతర్భాగం చల్లబడుతుండటంతో క్రమంగా కుంచించుకుపోతోందని పరిశోధన శాస్త్రవేత్త థామస్ వాటర్స్ తెలిపారు. అయితే గడచిన కోట్ల ఏళ్ళల్లో ఎన్ని మీటర్ల వరకూ చంద్రుడి పరిమాణం తగ్గింది ?
జ: 50 మీటర్లు
11) చంద్రుడిపై మహిళా వ్యోమగామిని దించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ పేరేంటి ?
జ: ఆర్టెమిస్