Saturday, March 23

CURRENT AFFAIRS – MAY 14

రాష్ట్రీయం
1) లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ భగివత్ కు ఏ నివేదికలో చోటు దక్కింది ?
జ: అసెంట్ నివేదిక
(నోట్: కెనడాకి చెందిన అసెంట్ సాఫ్ట్ వేర్ అండ్ డేటా సంస్థ 2017 టాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ స్లేవరీ ఇన్‌ఫ్లుయెన్స్‌ లీడర్స్ జాబితాలో భగవత్ పేరు చేర్చారు )
2) మహిళల్ని ఆవిష్కర్తలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: నీతి ఆయోగ్ తో
3) గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించిన మంగలాపురం టేల్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: రిటైర్డ్ డీజీపీ ఎన్ ఆనంద్ రామ్ భార్య విమలా ఆనంద్ రామ్
4) దూలపల్లి లేదా ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో ఏ పరిశోధనా కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: వెదురు పరిశోధనా కేంద్రం ( బ్యాంబూ రిసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ )

జాతీయం
5) శత్రు దేశపు భూతళ దళాలను గుర్తించి నాశనం చేయడానికి ఎయిర్ క్వాలరీ పేరుతో కొత్త వ్యూహాన్ని భారత్ ప్రయోగించింది. విజయ్ ప్రహార్ పేరుతో ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: రాజస్థాన్ లోని సూరత్ గఢ్ లో
6) 30 రోజుల పాటు యుద్దం చేయగలిగేలా సైన్యానికి ఆయుధాలను సమకూర్చేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లతో దేశీయంగా ఆయుధాల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ?
జ: రూ.15వేల కోట్లు
7) 1966 జనవరి 11న అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో కన్నుమూశారు. ఈయన మరణంపై విచారణ జరిపేందుకు 1997లో జనతా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి?
జ: రాజ్ నారాయణ్ కమిటీ
8) న్యాయ సమీక్షకు వీలు లేకుండా SC/ST చట్టాన్ని ఏ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 9వ షెడ్యూల్ లో
9) దేశమంతటా 30 డాప్లర్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ఉపయోగం ఏంటి ?
జ: వాతావరణానికి సంబంధించి నిర్ధిష్ట సమాచారం తెలుసుకోవచ్చు
10) టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( THE) ఎమర్జింగ్ ఎకనామీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో 2018 సంవత్సరానికి నాలుగో ర్యాంకు దక్కించుకున్న ఐఐటీ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ

అంతర్జాతీయం
11) అణ్వస్త్రరహిత కొరియా సాధన కోసం ఈనెల 23-25 తేదీల్లో ఏ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేస్తున్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది ?
జ: పుంగ్వే- రి కేంద్రం
12) బ్రిటన్ లో అత్యంత కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన భారత సంతతి సోదరులు ఎవరు ?
జ: హిందూజా సోదరులు
13) చైనా తొలి స్వదేశీ విమాన వాహక నౌకను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఈ వాహక నౌక ఎంత బరువు ఉంటుంది ?
జ: 50 వేల టన్నులు
14) స్పానిష్ గ్రాండ్ ప్రి రేసులో పోల్ పొజిషన్ నుంచి మొదలుపెట్టి ఛాంపియన్ గా నిలిచినది ఎవరు ?
జ: హామిల్టన్

SI/PC/VRO/GR-II/GR.IV ఆన్ లైన్ మాక్ టెస్టులు

వివరాలకు క్లిక్ చేయండి:  https://telanganaexams.com/si-pc-mocktests/

 

https://telanganaexams.com/sipc-posts/